Telugu Global
Health & Life Style

లో క్యాలరీ డైట్‌తో.. ఈజీగా బరువు తగ్గొచ్చు

బరువు తగ్గాలని చాలామందికి ఉంటుంది. కానీ దానికోసం ఏం చేయాలో తెలీదు. బరువు తగ్గడం గురించి రకరకాల అపోహలు. అయితే బరువు తగ్గడానికి అన్నింటికంటే సింపుల్ టెక్నిక్ ఒకటుంది. అదేంటంటే.. శరీరానికి కావల్సిన క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీలు తీసుకున్నప్పుడు బరువు పెరుగుతాం. అందుకే లో క్యాలరీ డైట్ తీసుకోవడం ద్వారా తెలియకుండానే మెల్లగా బరువు తగ్గొచ్చు. తక్కువ క్యాలరీలున్న ఫుడ్ ను తీసుకుంటూ.. పోషకాలన్నీ ఉండేలా సరిచూసుకుంటే చాలు. ఎంత ఎక్కువ బరువున్న వారైనా నెమ్మదిగా […]

లో క్యాలరీ డైట్‌తో.. ఈజీగా బరువు తగ్గొచ్చు
X

బరువు తగ్గాలని చాలామందికి ఉంటుంది. కానీ దానికోసం ఏం చేయాలో తెలీదు. బరువు తగ్గడం గురించి రకరకాల అపోహలు. అయితే బరువు తగ్గడానికి అన్నింటికంటే సింపుల్ టెక్నిక్ ఒకటుంది. అదేంటంటే..
శరీరానికి కావల్సిన క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీలు తీసుకున్నప్పుడు బరువు పెరుగుతాం. అందుకే లో క్యాలరీ డైట్ తీసుకోవడం ద్వారా తెలియకుండానే మెల్లగా బరువు తగ్గొచ్చు.

తక్కువ క్యాలరీలున్న ఫుడ్ ను తీసుకుంటూ.. పోషకాలన్నీ ఉండేలా సరిచూసుకుంటే చాలు. ఎంత ఎక్కువ బరువున్న వారైనా నెమ్మదిగా బరువు తగ్గుతారు. అలాంటి కొన్ని బెస్ట్ ఫుడ్స్ ఏంటంటే..

కీరదోస
కీరదోస, బీర, గుమ్మడి కాయల్లో క్యాలరీలు తక్కువగా, పోషకాలు మెండుగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్లు వీటిని డైట్ చార్ట్‌‌‌‌లో చేర్చు కోవచ్చు. బాగా ఆకలివేసినప్పుడు వీటిని తింటే మంచిది.
సిట్రస్ ఫ్రూట్స్
సిట్రస్ ఫ్రూట్స్‌‌ లో శరీరానికి కావల్సిన విటమిన్స్, క్యాలరీలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఎనర్జీ లెవెల్స్ కూడా సరిగ్గా మెయింటెయిన్ అవుతాయి.
ఆకు కూరలు
ఆకుకూరల్లో చాలా తక్కువగా క్యాలరీలుంటాయి. కానీ పోషకాల్లో ఇవి సూపర్ ఫుడ్స్. ఇవి ఈజీగా డైజెస్ట్ అవ్వడంతో పాటు బరువు తగ్గించుకునేందుకు హెల్ప్ అవుతాయి.
గుడ్లు
పోషకాల గుడ్డును రోజూ తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. రోజుకి ఒక గుడ్డు తినడం ద్వారా శరీరానికి కావల్సిన ప్రొటీన్, పోషకాలు అందుతాయి. అలాగే గుడ్డు వల్ల మెటబాలిజమ్‌‌‌‌ను పెరిగి, బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది.
సూప్స్
సూప్స్ ఆకలిని తీరుస్తాయి. పైగా క్యాలరీలు తక్కువ. అందుకే డైటింగ్ చేస్తున్నవాళ్లు హెవీ ఫుడ్ తినాల్సిన టైంలో సూప్స్ తీసుకుంటే మంచిది. సూప్స్ మనకు కావల్సిన శక్తినిస్తాయి.

First Published:  7 Feb 2021 5:15 AM GMT
Next Story