Telugu Global
NEWS

తెలంగాణ తెరమీదకు వైఎస్ షర్మిల

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చలాయించిన కాంగ్రెస్, టీడీపీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. విభజన తరువాత టీడీపీ నామమాత్రంగా మిగిలింది. ఇక కాంగ్రెస్ అస్థిత్వాన్ని కాపాడుకోవానికి నానా కష్టాలు పడుతోంది. ప్రధాన పార్టీలను బలహీన పరచడంలో అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే చెప్పాలి. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు దాటినా తెలంగాణలో అధికారపార్టీకి మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. టీఆర్ఎస్ మినహా మరో ప్రాంతీయ పార్టీ […]

తెలంగాణ తెరమీదకు వైఎస్ షర్మిల
X

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చలాయించిన కాంగ్రెస్, టీడీపీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. విభజన తరువాత టీడీపీ నామమాత్రంగా మిగిలింది. ఇక కాంగ్రెస్ అస్థిత్వాన్ని కాపాడుకోవానికి నానా కష్టాలు పడుతోంది. ప్రధాన పార్టీలను బలహీన పరచడంలో అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే చెప్పాలి. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు దాటినా తెలంగాణలో అధికారపార్టీకి మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. టీఆర్ఎస్ మినహా మరో ప్రాంతీయ పార్టీ ఉనికే లేదు. మరోవైపు ఈ గ్యాప్ ని భర్తీ చేసేందుకు బీజేపీ దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త శక్తి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే దిశలో అడుగులువేస్తున్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఈ రోజు ఆమె కొందరు వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనానికి హాజరుకావాలంటూ వైఎస్ షర్మిల కార్యాలయం నుంచి తెలంగాణకు చెందిన పలువురు నేతలకు పిలుపు అందింది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన క్యాంపెయిన్ జోరుగాసాగుతోంది. తొలిరోజు సమావేశంలో నల్లగొండ జిల్లాకు చెందిన 5వేల మంది పాల్గొంటారని అంచనా. నిజానికిది ఇది ఆత్మీయ సమ్మేళనం మాత్రమే అని చెబుతున్నప్పటికీ కొత్త పార్టీకి గల అవకాశాలపై చర్చించేందుకే అని తెలుస్తోంది. అందుకే తెలంగాణలో స్తబ్ధుగా ఉన్న వైఎస్ఆర్ అభిమానులతో పాటు, వేరు వేరు పార్టీల్లోని అసంతృప్త నేతలను ఏకంచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కొత్త పార్టీ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. నేరుగా షర్మిల పేరును ప్రస్తావించకుండా కొత్త పార్టీని పెట్టడం అంత సలువు కాదని, ఇప్పటి వరకు పార్టీలు పెట్టిన విజయశాంతి, దేవేందర్ గౌడ్, నరేంద్ర లాంటి నాయకులు ఏమయ్యారో తెలీదా అని వ్యాఖ్యానించిట్లు సమాచారం. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా మరో పార్టీ పెట్టినా అది నాలుగు రోజుల ముచ్చటే అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ మినహా తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ నిలదొక్కుకునే అవకాశం లేదని కేసీఆర్ ధీమావ్యక్తం చేశారట.

నిజానికి తెలంగాణ ప్రజలు సుధీర్ఘ కాలం పాటు కాంగ్రెస్, టీడీపీ పాలనను చూసి విసిగిపోయారు. గడిచిన ఆరేళ్లలో టీఆర్ఎస్ పాలననూ చూశారు. గత పార్టీలకూ టీఆర్ఎస్ కు పెద్దగా తేడాను ఫీలవ్వడం లేదు కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ నిలదొక్కుకోవడానికి అవకాశం ఉందనేది వైఎస్ఆర్ అభిమానుల వాదన. అందుకే… అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందే పార్టీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులు భారీగానే ఉన్నారు. షర్మిల పార్టీ పెడితే… కాంగ్రెస్ లోని చాలా మంది నేతలు కొత్త పార్టీవైపు మళ్లే అవకాశం ఉంటుందనేది అంచనా. ఈ నేపథ్యంలో నేడు జరుగనున్న ఆత్మీయ సమ్మేళనం మరింత ఆసక్తికరంగా మారింది.

First Published:  8 Feb 2021 10:57 PM GMT
Next Story