Telugu Global
Others

కొన్నిచోట్ల పోటీ వైసీపీ వ‌ర్గాల మ‌ధ్యే

అనంత‌పురం జిల్లా త‌లుపుల మండ‌లం ఈదుల‌కుంట్ల‌ప‌ల్లి గ్రామ పంచాయితీలో వైసీపీ రెబ‌ల్స్ మ‌ధ్య ప్ర‌ధానంగా పోటీ నెల‌కొంది. ఏక‌గ్రీవం కావాల్సిన ఈ స్థానం వ‌ర్గ‌పోరుతో ఎన్నిక‌ల‌కు వెళ్లింది. ఎస్టీ మ‌హిళ‌కు రిజ‌ర్వు అయిన ఈ పంచాయితీలో బోరువెల్‌ మ‌ధుసూద‌న్‌రెడ్డి వ‌ర్గం త‌ర‌ఫున వ‌నిత‌మ్మ‌, కొత్త‌ప‌ల్లి న‌ర‌సింహారెడ్డి వ‌ర్గం త‌ర‌ఫున కుమారిభాయి బ‌రిలో దిగారు. తెలుగుదేశం అభ్య‌ర్థి నామ‌మాత్ర‌పు పోటీ ఇచ్చారు. గెలుపును ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ఇరువ‌ర్గాలూ తీవ్రంగా శ్ర‌మించాయి. మ‌ధుసూద‌న్‌రెడ్డి భార్య గ‌తంలో ఇక్క‌డ స‌ర్పంచుగా ప‌నిచేసిన‌ప్ప‌టికీ […]

కొన్నిచోట్ల పోటీ వైసీపీ వ‌ర్గాల మ‌ధ్యే
X

అనంత‌పురం జిల్లా త‌లుపుల మండ‌లం ఈదుల‌కుంట్ల‌ప‌ల్లి గ్రామ పంచాయితీలో వైసీపీ రెబ‌ల్స్ మ‌ధ్య ప్ర‌ధానంగా పోటీ నెల‌కొంది. ఏక‌గ్రీవం కావాల్సిన ఈ స్థానం వ‌ర్గ‌పోరుతో ఎన్నిక‌ల‌కు వెళ్లింది. ఎస్టీ మ‌హిళ‌కు రిజ‌ర్వు అయిన ఈ పంచాయితీలో బోరువెల్‌ మ‌ధుసూద‌న్‌రెడ్డి వ‌ర్గం త‌ర‌ఫున వ‌నిత‌మ్మ‌, కొత్త‌ప‌ల్లి న‌ర‌సింహారెడ్డి వ‌ర్గం త‌ర‌ఫున కుమారిభాయి బ‌రిలో దిగారు. తెలుగుదేశం అభ్య‌ర్థి నామ‌మాత్ర‌పు పోటీ ఇచ్చారు. గెలుపును ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ఇరువ‌ర్గాలూ తీవ్రంగా శ్ర‌మించాయి. మ‌ధుసూద‌న్‌రెడ్డి భార్య గ‌తంలో ఇక్క‌డ స‌ర్పంచుగా ప‌నిచేసిన‌ప్ప‌టికీ ఆ వ‌ర్గానికి చెందిన వ‌నిత‌మ్మ గెలుపుకు దోహ‌దం కాలేదు. అంత‌కు ముందు ఏక‌గ్రీవంగా స‌ర్పంచుగా ఎన్నికైన కొత్త‌ప‌ల్లి న‌ర‌సింహారెడ్డి చేసిన అభివృద్ధి ప‌నులు, ప్ర‌జా సంబంధాలు కుమారిబాయికి క‌లిసి వ‌చ్చాయి. మ‌‌ధుసూద‌న్‌రెడ్డితోపాటు ఆయ‌న బ‌ల‌ప‌ర‌చిన‌ అభ్య‌ర్థి స్థానికంగా లేక‌పోవ‌డం మైన‌స్సుగా చెబుతున్నారు. న‌ర‌సింహారెడ్డి వ‌ర్గం బ‌ల‌ప‌ర‌చిన కుమారిబాయి భ‌ర్త దేవేంద‌ర్ నాయ‌క్ స్థానికంగా ఉండ‌టం, గ‌తంలో ఫీల్డ్ అసిస్టెంటుగా ప‌నిచేసి అంద‌రితో క‌లిసిపోవ‌డం క‌లిసివ‌చ్చిందంటున్నారు. ఇక న‌ర‌సింహారెడ్డి ఆయ‌న బంధువులు ఈ ఎన్నిక‌ను స‌వాలుగా తీసుకుని అహ‌ర‌హం శ్ర‌మించారు. మొత్తం 10 వార్డుల్లో 9 వార్డులు న‌ర‌సింహారెడ్డి వ‌ర్గ‌మే ఏక‌గ్రీవం చేసుకుంది. ఒక్క వార్డులో మాత్ర‌మే పోటీ జ‌రిగింది. ఆ వార్డులో కూడా న‌ర‌సింహారెడ్డి వ‌ర్గం మెంబ‌రు 50 ఓట్ల పైచిలుకు మెజార్టీ సాధించారు. పోటీపోటీ ఉందంటూ ప్ర‌చారం జ‌రిగిన ఈ పంచాయితీలో న‌ర‌సింహారెడ్డి వ‌ర్గం గెలుపు న‌ల్లేరుమీద న‌డ‌కే అయింది. మంచం గుర్తు కేటాయించిన కుమారిబాయి 261 ఓట్ల మెజార్టీ సాధించ‌డం విశేషంగా చెప్పుకోవాలి. ఎమ్మెల్యే సిద్దారెడ్డి ఆశీస్సుల‌తో ఈదుల‌కుంట్ల‌ప‌ల్లి పంచాయితీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామ‌ని విజేత‌లు స్ప‌ష్టం చేశారు. పైపై ప‌టాటాల‌కు, ప్ర‌లోభాల‌కు కాకుండా, నిజ‌మైన నాయ‌కుల‌ను గుర్తించి గెలిపించిన పంచాయితీ ఓట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

First Published:  10 Feb 2021 2:19 AM GMT
Next Story