Telugu Global
NEWS

మ‌రో మైలురాయిని దాటిన ఏపీ క‌ల‌ల ప్రాజెక్ట్‌

పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్ జీవనాడి త్వరలోనే సాకారం కాబోతోంది. ఏపీ కలల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం పట్టుబట్టి పూర్తి చేయిస్తోంది. సీఎం జగన్, మంత్రులు సమీక్షిస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ సంకల్పానికి తోడుగా ప్రాజెక్టు పనులు చేపట్టిన ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ’ కూడా రాత్రింబవళ్లు నిరంతరం పనులు చేస్తూ ముందుకు సాగుతోంది. పోలవరం ప్రాజెక్టులోనే అతి క్లిష్టమైన కష్టమైన టాస్క్ […]

మ‌రో మైలురాయిని దాటిన ఏపీ క‌ల‌ల ప్రాజెక్ట్‌
X

పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్ జీవనాడి త్వరలోనే సాకారం కాబోతోంది. ఏపీ కలల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం పట్టుబట్టి పూర్తి చేయిస్తోంది. సీఎం జగన్, మంత్రులు సమీక్షిస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ సంకల్పానికి తోడుగా ప్రాజెక్టు పనులు చేపట్టిన ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ’ కూడా రాత్రింబవళ్లు నిరంతరం పనులు చేస్తూ ముందుకు సాగుతోంది.

పోలవరం ప్రాజెక్టులోనే అతి క్లిష్టమైన కష్టమైన టాస్క్ ను తాజాగా పూర్తి చేయడం విశేషం. ప్రాజెక్టులో వరద నీటిని వదిలే స్పిల్ వే నిర్మాణం చేపట్టాలంటే 52 మీటర్ల ఎత్తున పిల్లర్లు నిర్మించాల్సి ఉంటుంది. స్పిల్ వే లో 2 వ బ్లాక్ లో ఫిష్ లాడర్ నిర్మాణం చేపట్టడం వల్ల దీని డిజైన్లకు సంబందించి అనుమతులు ఆలస్యం కావడం తో 2వ పిల్లర్ నిర్మాణం ఆలస్యమైంది. కానీ ఇటీవలే డిజైన్లు అన్నీ అనుమతులు వచ్చాక త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేసి స్లాబ్ లెవల్ కు అంటే సరాసరిన 52 మీటర్ల ఎత్తుకు అన్ని పిల్లర్ల నిర్మాణం పూర్తి చేసింది ఎంఈఐఎల్ సంస్థ. స్పిల్ వే పిల్లర్లపైన బ్రిడ్జి స్లాబ్ పనులు దాదాపు పూర్తి కావోచ్చాయి.

మేఘా సంస్థ 2019 నవంబర్ 21న పోలవరం కాంక్రీట్ పనులు మొదలు పెట్టింది. అప్పటి నుంచి రాత్రింబవళ్లు పనులు చేస్తోంది. స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ పొడవు 1128 మీటర్లకు గానూ ఇప్పటికే 1095 మీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. స్పిల్ వే పిల్లర్లపై పెట్టాల్సిన గడ్డర్లు 192 కాగా 188 గడ్డర్లను ఇప్పటికే పిల్లర్లపై ఏర్పాటు చేశారు. 4 గడ్డర్లు మాత్రమే పిల్లర్లపై పెట్టాల్సి ఉంది. 2019 నవంబర్ లో స్పిల్ వే పిల్లర్ల కాంక్రీట్ నిర్మాణం ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ అనతి కాలంలోనే ఆ పనులను పూర్తి చేసింది. స్పిల్ వే బ్రిడ్జ్ స్లాబ్ కాంక్రీట్ సెప్టెంబర్, 9 2020 లో మొదలు పెట్టింది. ఇక జులై 2020 లో స్పిల్ వే పిల్లర్లు పై గడ్డర్లు ఏర్పాటు చేయడం ప్రారంభించింది.

ఇప్పటికే స్పిల్ వే బ్రిడ్జ్ లో పూర్తయిన స్లాబ్ సంఖ్య 45, మిగిలిన 3 స్లాబ్ లు పనులు త్వరలోనే పూర్తి చేయడానికి సంస్థ రెడీ అయ్యింది. మొత్తం 49 ట్రూనియన్ భీమ్ లు పనులు పూర్తి చేయడంతో పాటు స్పిల్ వే బ్రిడ్జి లో మొత్తం 48 గేట్లకు గాను ఇప్పటికే 28 గేట్లను ఏర్పాటు చేసింది. త్వరలోనే గేట్లకు సిలిండర్లు, పవర్ ప్యాక్ లు అమర్చేందుకు ప్లాట్ ఫాం ఏర్పాట్ల పనులు చకచకా జరుగుతున్నాయి. దీంతో ఏపీ కలల ప్రాజెక్ట్ త్వరలోనే ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

దశాబ్ధాల కలను నెరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం, మేఘా సంస్థ కదులుతోంది. జగన్ హయాంలోనే ప్రాజెక్ట్ పూర్తి కానుంది. అతి త్వరలోనే ప్రజలకు సాగు, తాగునీటిని అందించే బృహత్ ప్రాజెక్ట్ ఆవిష్కృతం కాబోతోంది.

First Published:  11 Feb 2021 3:18 AM GMT
Next Story