Telugu Global
NEWS

రేవంత్​ పాదయాత్ర.. ప్రభావమెంత?

టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి.. ‘రాజీవ్​ రైతు భరోసా యాత్ర’ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్టు రేవంత్​ ప్రకటించారు. కానీ దాని వెనక రాజకీయ వ్యూహం దాగి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ మంచి ఫలితాలు రాబట్టింది. రాష్ట్రంలో టీఆర్​ఎస్​కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెప్పుకుంటున్నది. కాంగ్రెస్​ పార్టీ తన ఉనికిని కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. […]

రేవంత్​ పాదయాత్ర.. ప్రభావమెంత?
X

టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి.. ‘రాజీవ్​ రైతు భరోసా యాత్ర’ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్టు రేవంత్​ ప్రకటించారు. కానీ దాని వెనక రాజకీయ వ్యూహం దాగి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ మంచి ఫలితాలు రాబట్టింది. రాష్ట్రంలో టీఆర్​ఎస్​కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెప్పుకుంటున్నది. కాంగ్రెస్​ పార్టీ తన ఉనికిని కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే బీజేపీతో పొల్చితే నిజానికి కాంగ్రెస్​ పార్టీకి సంస్థాగతంగా గట్టి పట్టు ఉంది.

కానీ వాళ్లను ముందుకు నడిపే నేతే లేరు. కాంగ్రెస్​ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్​ పార్టీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా అధిష్ఠానం సూచన మేరకే రేవంత్​ పాదయాత్రకు పూనుకున్నట్టు సమాచారం.

ఆయన గత ఆదివారం అచ్చంపేటలో రైతు భరోసా దీక్షకు కూర్చున్నారు. ఆ రోజు సాయంత్రం దీక్ష ముగిశాక సడెన్​గా వ్యూహం మార్చి హైదరాబాద్​ వరకు పాదయాత్రగా వెళతానని ప్రకటించారు.

ఆ తర్వాత ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలను టచ్​ చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. అక్కడక్కడ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేవంత్​ పాదయాత్రకు కొన్ని చోట్ల స్పందన బాగానే వస్తున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్​ బలంగా ఉండేది. అయితే కాంగ్రెస్​ నేతలంతా టీఆర్​ఎస్, బీజేపీ​లో చేరిపోవడంతో ఆ పార్టీ ఖాళీ అయ్యింది. అయితే ఇప్పటికీ పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​కు బలమైన క్యాడర్​ ఉంది.

ఇప్పుడు రేవంత్​ పాదయాత్రతో క్యాడర్​, లీడర్లు ఏకమవుతున్నారని సమాచారం. ఈ పాదయాత్రతో కాంగ్రెస్​ బలపడటంతో పాటు రేవంత్​రెడ్డికి కూడా ఇమేజ్​ పెరుగుతోంది. రేవంత్​రెడ్డి తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు అదే సమయంలో సీఎం కేసీఆర్​, ఆయన కుమారుడు కేటీఆర్​పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు.రేవంత్​రెడ్డి ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీని తర్వాత ఆయన రంగారెడ్డి జిల్లాకు ఎంట్రీ ఇవ్వనున్నారు.

First Published:  11 Feb 2021 7:08 AM GMT
Next Story