Telugu Global
International

మిస్ ఇండియా వరల్డ్‌గా 'తెలంగాణ బ్యూటీ'

మన తెలంగాణ అమ్మాయి మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని సాధించింది. వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 కిరీటం తెలంగాణ యువతి వారణాసి మానసను వరించింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో మానసను విజేతగా ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన మానస గ్లోబల్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూళ్లో చదువుకున్నారు. వాసవి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసి.. ఆ తర్వాత ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్సేంజ్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి విభిన్నంగా ఆలోచించే మానస.. అన్ని […]

మిస్ ఇండియా వరల్డ్‌గా తెలంగాణ బ్యూటీ
X

మన తెలంగాణ అమ్మాయి మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని సాధించింది. వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 కిరీటం తెలంగాణ యువతి వారణాసి మానసను వరించింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో మానసను విజేతగా ప్రకటించారు.

హైదరాబాద్‌కు చెందిన మానస గ్లోబల్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూళ్లో చదువుకున్నారు. వాసవి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసి.. ఆ తర్వాత ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్సేంజ్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి విభిన్నంగా ఆలోచించే మానస.. అన్ని కళల్లో ముందున్నారు. చిన్నప్పటి నుంచే భరతనాట్యం, సంగీతం, యోగా ఇలా అన్నింటిపై ఇంట్రెస్ట్ పెంచుకుంది. అదే ఆమెను విజయానికి దగ్గర చేసింది. “నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఉంటుంది. దాన్నే నా బెస్ట్‌ ఫ్రెండ్‌గా భావిస్తాను” అని చెప్పే మానసకు పుస్తకాలంటే మక్కువ ఎక్కువ.

“జీవితం ఎప్పుడు ఏం ఇస్తుందో ఎవరూ చెప్పలేరు అందుకే సాధన చేస్తూ ఉండాలి. రాయడం, చిత్రలేఖనం, పాడటం.. ఇవే కాదు స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి, మంచి ఫ్రెండ్‌గా, మంచి తోబుట్టువుగా, మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా సాధన చేయాలి. అవసరమైన చోట కోపం, అవసరమైన వారికి దయ ఎలా అందించాలో కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ మనల్ని శక్తిమంతుల్ని చేస్తాయి. ఇవే మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని నేను గ్రహించాను” అని చెప్పారామె.

మిస్‌ ఇండియా వరల్డ్‌గా నిలిచిన మానస పేరు ఇంటర్నెట్ లో మారుమ్రోగిపోతుంది. తెలంగాణ గర్ల్‌, తెలంగాణ బ్యూటీ పేరుతో ఇంటర్నెట్‌ లో కొన్ని లక్షల మంది సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న మానస.. ఈ ఏడాదిలో జరుగబోయే 70వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కూడా భారత్‌ తరఫున పాల్గొనడానికి రెడీ అవుతుంది.

First Published:  12 Feb 2021 3:31 AM GMT
Next Story