Telugu Global
Cinema & Entertainment

కేజీఎఫ్ ఛాప్టర్ 2.. భారీ డీల్

త్వరలోనే రిలీజ్ కాబోతున్న కేజీఎఫ్2 సినిమాకు సంబంధించి మరో భారీ డీల్ పూర్తయింది. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ లో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా, ఇప్పుడు శాటిలైట్ లో మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు సంబంధించి సౌత్ శాటిలైట్ డీల్ పూర్తయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన శాటిలైట్ రైట్స్ ను జీ గ్రూప్ సంస్థ దక్కించుకుంది. కేవలం శాటిలైట్ హక్కుల కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది ఈ సంస్థ. […]

కేజీఎఫ్
X

త్వరలోనే రిలీజ్ కాబోతున్న కేజీఎఫ్2 సినిమాకు సంబంధించి మరో భారీ డీల్ పూర్తయింది. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ లో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా, ఇప్పుడు శాటిలైట్ లో మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు సంబంధించి సౌత్ శాటిలైట్ డీల్ పూర్తయింది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన శాటిలైట్ రైట్స్ ను జీ గ్రూప్ సంస్థ దక్కించుకుంది. కేవలం శాటిలైట్ హక్కుల కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది ఈ సంస్థ. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను 55 కోట్ల రూపాయలకు ఇదివరకే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను జులై 16న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. మొదటి భాగంతో పోలిస్తే.. ఛాప్టర్-2లో పాన్ ఇండియా అప్పీల్ కలిగించే స్టార్స్ చాలామంది ఉన్నారు. సంజయ్ దత్, రవీన్ టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్.. ఇలా చాలామంది ఆర్టిస్టులు ఈసారి కనిపించబోతున్నారు.

First Published:  13 Feb 2021 9:46 AM GMT
Next Story