Telugu Global
NEWS

ఎదురొస్తే చంపేస్తారు.. నిమ్మాడలో కింజరాపు ఫ్యామిలీ క్రిమినల్ రాజకీయం..

టెక్కలి ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగడాలు అన్నీ ఇన్నీ కావని, సోదరుడు హరిప్రసాద్ తో కలసి ఆయన ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టారని, హత్యలు చేశారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు టెక్కలి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్. కింజరాపు సోదరుల క్రిమినల్ యాక్టివిటీస్ పై కోర్టు సుమోటోగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అచ్చన్న అరాచకాలు ఇవీ అంటూ ఆయన మీడియా సమావేశంలో వివరించారు. అరాచకాలివీ.. 1982-83 టీడీపీ ఆవిర్భావం సమయంలోనే కింజరాపు […]

ఎదురొస్తే చంపేస్తారు.. నిమ్మాడలో కింజరాపు ఫ్యామిలీ క్రిమినల్ రాజకీయం..
X

టెక్కలి ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగడాలు అన్నీ ఇన్నీ కావని, సోదరుడు హరిప్రసాద్ తో కలసి ఆయన ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టారని, హత్యలు చేశారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు టెక్కలి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్. కింజరాపు సోదరుల క్రిమినల్ యాక్టివిటీస్ పై కోర్టు సుమోటోగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అచ్చన్న అరాచకాలు ఇవీ అంటూ ఆయన మీడియా సమావేశంలో వివరించారు.

అరాచకాలివీ..
1982-83 టీడీపీ ఆవిర్భావం సమయంలోనే కింజరాపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు తండ్రి దాలి నాయుడు హత్యాకాండ మొదలైందని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్. 40ఏళ్లుగా ఈ హత్యాకాండ కొనసాగుతోందని మండిపడ్డారు. బంధువు అని కూడా చూడకుండా కింజరాపు సవరయ్య అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీకి వస్తే అతన్ని చంపేశారని అన్నారు. ఆ తర్వాత బాలయ్య, ఎచ్చెర్ల సూర్యనారాయణలను కూడా ఇలానే చంపేశారని అన్నారు. కింజరాపు గణపతి పోటీకి వస్తే ఆయన కుమార్తెను నడిరోడ్డుపై వివస్త్రను చేసి అవమానించారని చెప్పారు. 1994 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పన్నింటిపేటలో రిగ్గింగ్ కి పాల్పడుతున్న అచ్చెన్నాయుడని వారించినందుకు కూన రామారావు అనే వ్యక్తిని అచ్చెన్నాయుడే స్వయంగా కత్తితో పొడిచి చంపారని ఆరోపించారు. అప్పట్లో ఊరి ప్రజలంతా అచ్చెన్నాయుడిని తరిమి తరిమి కొట్టారని, ఆయనకు గుండి గీయిస్తే, ఇప్పటికీ తలపై ఆ గుర్తులుంటాయని చెప్పారు. రిగ్గింగ్ అడ్డుకున్న పోలీసుని బెదిరించిన కేసులో శిక్ష పడినా కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకున్నారని అన్నారు. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుడు భుజంగరావు నామినేషన్ ని అడ్డుకున్నారని, కత్తితో పొడిచి చంపారని అన్నారు. అచ్చెన్నాయుడు రౌడీ, గూండా, క్రిమినల్, మర్డరిస్ట్, మహిళలను హింసించిన ద్రోహి, పెద్దఎత్తున అక్రమాస్తులు కూడబెట్టిన నేరగాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు దువ్వాడ శ్రీనివాస్. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో అచ్చెన్న బంధువు కింజరాపు అప్పన్న నామినేషన్ వేయడానికి వస్తుంటే చంపేస్తామని బెదిరించారని, వైసీపీ ఇన్ చార్జిగా తాను వెళ్తే.. తనని కూడా బెదిరించారని, వారి దాడినుంచి తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని వివరించారు శ్రీనివాస్. ఆ సమయంలో అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరిప్రసాద్ తమ కార్లు ధ్వంసం చేశారని అన్నారు. 40 ఏళ్ళుగా టెక్కలి నియోజకవర్గంలోని 15 పంచాయతీల్లో కింజరాపు సోదరులు వైరిపక్షం వారిని నామినేషన్లు వేయనీయరని, ఒకవేళ వేసినా, ఓట్లు పడనీయకుండా అడ్డుకుంటారని అన్నారు.

అక్రమాస్తులివీ..
అక్రమాలు చేయడమే కాకుండా అక్రమంగా ఆస్తులు కూడా కూడబెట్టారని కింజరాపు బ్రదర్స్ పై ధ్వజమెత్తారు దువ్వాడ శ్రీనివాస్. నిమ్మాడలో ప్రభుత్వ భూముల్లో ఎఫ్.సి.ఐ. గోడౌన్స్ నిర్మించి, వారి కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారని, ప్రజల భూములను ఆక్రమించారని అన్నారు.
అచ్చెన్నాయుడికి చెందిన భవానీ గ్రానైట్స్ ఫ్యాక్టరీలో 2014-19 వరకు అక్రమాలు జరిగాయని, రూ.39కోట్ల మేర రాళ్లను అక్రమంగా తరలించారని అన్నారు. విజిలెన్స్ అధికారులకు జరిమానా కట్టి బయటపడ్డారని అన్నారు. సారా కాంట్రాక్టర్ గా అచ్చెన్నాయుడు 75 షాపులు బినామీగా పెట్టుకుని మద్యం అక్రమ వ్యాపారాన్ని నడిపారని ఆరోపించారు. రైస్ మిల్లర్లు, మద్యం షాపుల వద్ద నెలవారీ మామూళ్ళు వసూలు చేశారని చెప్పారు. కింజరాపు హరిప్రసాద్ పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బినామీల పేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని, ప్రభుత్వ ఖజానాకు రూ.18కోట్ల నష్టం చేకూర్చారని అన్నారు. వీటన్నిటిపై పిటిషన్ వేసి సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని చెప్పారు.

టెక్కలి పంచాయతీల్లో వైసీపీ ప్రభంజనం..
జగన్ హయాంలో నిమ్మాడలో శాంతి భద్రతలు నెలకొన్నాయని అన్నారు దువ్వాడ. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ 90శాతం పైగా పంచాయతీల్లో ఘన విజయం సాధిస్తుందని అన్నారు. తొలిదశలో టెక్కలి నియోజకవర్గంలోని 4 మండలాల్లో 135 స్థానాలకు గాను 113 స్థానాల్లో వైసీపీ బలపరచిన అభ్యర్థులు గెలిచారని, గతంలో అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఇలాంటి ప్రభంజనం రాలేదని, తొలిసారి కింజరాపు సోదరుల ఆగడాలకు అడ్డుగట్ట పటిందని అన్నారు.

First Published:  13 Feb 2021 7:50 AM GMT
Next Story