Telugu Global
Cinema & Entertainment

సుమంత్ అశ్విన్ పెళ్లి

టాలీవుడ్ లో మరో హీరో ఓ ఇంటివాడయ్యాడు. హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి కొద్దిసేపటి కిందట పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ లోని ఎమ్మెస్ రాజు కు చెందిన ఫామ్ హౌజ్ లో సుమంత్-అశ్విన్, దీపికల పెళ్లి సింపుల్ గా జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి ఎవ్వర్నీ ఆహ్వానించలేదు. కేవలం కొంతమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ పెళ్లి తంతును పూర్తిచేశాడు ఎమ్మెస్ రాజు. ఇది ప్రేమ వివాహం కాదు. కొడుకు కోసం రాజు చూసిన […]

సుమంత్ అశ్విన్ పెళ్లి
X

టాలీవుడ్ లో మరో హీరో ఓ ఇంటివాడయ్యాడు. హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి కొద్దిసేపటి కిందట పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ లోని ఎమ్మెస్ రాజు కు చెందిన ఫామ్ హౌజ్ లో సుమంత్-అశ్విన్, దీపికల పెళ్లి సింపుల్ గా జరిగింది.

ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి ఎవ్వర్నీ ఆహ్వానించలేదు. కేవలం కొంతమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ పెళ్లి తంతును పూర్తిచేశాడు ఎమ్మెస్ రాజు. ఇది ప్రేమ వివాహం కాదు. కొడుకు కోసం రాజు చూసిన సంబంధం ఇది. పెళ్లి కూతురు దీపిక అమెరికాలో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తోంది.

ఈరోజు పొద్దున్నుంచి సుమంత్ అశ్విన్ పెళ్లి వేడుక మొదలైంది. మంగళ స్నానాల నుంచి మెహందీ, సంగీత్.. ఇలా అన్ని పద్ధతిగా పూర్తిచేశారు. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం ”ఇదే మా కథ” అనే సినిమా చేస్తున్నాడు సుమంత్ అశ్విన్. వచ్చేనెల ఈ సినిమా విడుదల కానుంది.

First Published:  13 Feb 2021 9:49 AM GMT
Next Story