Telugu Global
NEWS

విహార యాత్రలో విషాదాలు.. కరోనా కాలం తర్వాత కన్నీళ్లు..

కరోనా కష్టకాలంలో ఒకిరొకరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. కుటుంబ సభ్యులు, ప్రాణ స్నేహితులు సైతం.. నెలల తరబడి కలుసుకోలేకపోవడం విధి విచిత్రం. అయితే కరోనా ప్రభావం తగ్గాక.. ఆ ఉత్సాహం మళ్లీ అందరిలో ఉరకలెత్తింది. ప్రయాణాలు ఊపందుకున్నాయి, విహార యాత్రలకి కూడా చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే జరిగిన ఘోర ప్రమాదాలు మాత్రం కుటుంబ సభ్యుల్లో తీవ్ర మనోవేదన మిగిల్చాయి. అరకు విషాదం.. ప్రతి చిన్న ఫంక్షన్ కి కూడా దాదాపు 300మంది హాజరు కావడం […]

విహార యాత్రలో విషాదాలు.. కరోనా కాలం తర్వాత కన్నీళ్లు..
X

కరోనా కష్టకాలంలో ఒకిరొకరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. కుటుంబ సభ్యులు, ప్రాణ స్నేహితులు సైతం.. నెలల తరబడి కలుసుకోలేకపోవడం విధి విచిత్రం. అయితే కరోనా ప్రభావం తగ్గాక.. ఆ ఉత్సాహం మళ్లీ అందరిలో ఉరకలెత్తింది. ప్రయాణాలు ఊపందుకున్నాయి, విహార యాత్రలకి కూడా చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే జరిగిన ఘోర ప్రమాదాలు మాత్రం కుటుంబ సభ్యుల్లో తీవ్ర మనోవేదన మిగిల్చాయి.

అరకు విషాదం..
ప్రతి చిన్న ఫంక్షన్ కి కూడా దాదాపు 300మంది హాజరు కావడం వారి మధ్య ఉన్న అభిమానం, ఆప్యాయతకు నిదర్శనం. అలాంటిది కరోనా వల్ల వారంతా కలసి చేసే సందడికి నెలల విరామం వచ్చింది. దీంతో ఈసారి విహార యాత్రకు వెళ్దామని బయలుదేరారు హైదరాబాద్ కి చెందిన కె.సత్యనారాయణ వారి బంధువులు. విజయవాడ దుర్గమ్మ దర్శనం, ఆ తర్వాత అన్నవరం సత్యదేవుడి ఆశీర్వాదం తీసుకుని.. విశాఖ జిల్లా అరకులో సరదాగా గడిపి, బొర్రా గుహల అందాలు వీక్షించి, తిరుగు ప్రయాణంలో బస్సు అరకు లోయలో పడిపోవడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణంపాలయ్యారు. 22మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈనెల 10న వీరంతా హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, అన్నవరం, సింహాచలం.. ఇలా అన్ని ప్రాంతాలను సందర్శించి, తిరుగు ప్రయాణంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. టూరిస్ట్ బస్సు బ్రేకులు ఫెయిలవడంతో ఈప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కరోనా కాలం తర్వాత ప్రయాణాలు ఊపందుకుంటున్న దశలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన తొలి ఘోర ప్రమాదం ఇదే కావడం గమనార్హం..

ధార్వాడ్ ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటే..?
సంక్రాంతి సందర్భంగా పాత స్నేహితుంతా ఒక్కచోట చేరి సందడి చేయడం వారికి అలవాటు. దానికోసం లేడీస్ క్లబ్ ఏర్పాటు చేసుకుని మరికొంతమందిని కూడా తమతో కలుపుకున్నారు. సంక్రాంతే కాదు, ఏ చిన్న ఫంక్షన్ అయినా, పండగ అయినా.. బాల్య స్నేహితులంతా ఒకేచోట గుమికూడతారు. స్నేహితులంతా కలసి ఉండాలనే కారణంతో వారంతా ఒకేప్రాంతంలో ఇళ్లు కొనుక్కున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అాలంటి బాల్య స్నేహితుల్ని పుణె-బెంగళూరు హైవే ధార్వాడ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం విడదీసింది. టూరిస్ట్ బస్సుని లారీ ఢీకొన్న ఈ ఘటనలో స్పాట్ లో 11మంది చనిపోగా.. ఆ తర్వాత మృతుల సంఖ్య 17కి చేరింది. సెయింట్ పాల్స్ కాన్వెంట్ లో చదువుకున్న ఆ మహిళలంతా గోవా టూర్ కి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగింది. జనవరి 15న జరిగిన ఈ ఘటన ఆ మహిళల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

కలిపినట్టే కలిపి విడదీసిన కరోనా..
కరోనా కష్టకాలంలో ఒకరికి ఒకరు దూరంగా ఉండటం, ఆ భయం తొలగిపోయాక.. తొలిసారి ఉత్సాహంగా ప్రయాణాలకు సిద్ధపడటం, అంతలోనే వారి విహార యాత్రలు విషాదాంతంగా మారడం.. ఇదీ ఈ రెండు ఘటనల్లో ఉన్న పోలిక. ధార్వాడ్ ప్రమాదంలో టూర్ కి వెళ్లే క్రమంలో మహిళా స్నేహితులు ప్రాణాలు కోల్పోగా.. విశాఖ జిల్లాలో టూర్ ముగిసిందన్న ఉత్సాహంతో, ఇంటికి చేరుకుంటున్నామన్న సంతోషంలో ఉన్న వారిని విధి బలి తీసుకుంది.

First Published:  12 Feb 2021 10:57 PM GMT
Next Story