Telugu Global
Cinema & Entertainment

ఉప్పెనలా వస్తున్న వసూళ్లు

ఉప్పెన సినిమాకు వసూళ్లు పోటెత్తుతున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటోంది ఈ సినిమా. మొదటిరోజు 9 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు ఏకంగా 18 కోట్ల షేర్ స్థాయికి ఎదిగింది. ఓ కొత్త హీరో, ఓ కొత్త హీరోయిన్ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారి. విడుదలైన 2 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల 77 లక్షల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో […]

ఉప్పెనలా వస్తున్న వసూళ్లు
X

ఉప్పెన సినిమాకు వసూళ్లు పోటెత్తుతున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీని పూర్తిస్థాయిలో సద్వినియోగం
చేసుకుంటోంది ఈ సినిమా. మొదటిరోజు 9 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు
ఏకంగా 18 కోట్ల షేర్ స్థాయికి ఎదిగింది. ఓ కొత్త హీరో, ఓ కొత్త హీరోయిన్ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు
రావడం ఇదే తొలిసారి.

విడుదలైన 2 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల 77 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ షేర్ విలువ 16 కోట్ల 73 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ఈ సినిమాకు 2
రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – 5.75
ఉత్తరాంధ్ర – 2.67
ఈస్ట్ – 1.63
వెస్ట్ – 1.13
కృష్ణా – 1.10
గుంటూరు – 1.42
సీడెడ్ – 2.45
నెల్లూరు – 0.58

First Published:  14 Feb 2021 4:50 AM GMT
Next Story