Telugu Global
Cinema & Entertainment

ఉప్పెన రికార్డు సృష్టించింది

ఉప్పెన సినిమా దుమ్ముదులుపుతోంది. విడుదలైన 3 రోజులకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. తన తొలి సినిమాకే వైష్ణవ్ తేజ్, మార్కెట్ పరంగా స్టార్ అయిపోయాడు. అటు బుచ్చిబాబు ఆనందానికి హద్దుల్లేవు. మొదటి సినిమా ఇంత సక్సెస్ అవుతుందని కలలో కూడా ఊహించని ఆ దర్శకుడు.. ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంటున్నాడు. ఇక ఉప్పెన వారాంతం వసూళ్ల విషయానికొస్తే.. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 28 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు […]

uppena-teaser
X

ఉప్పెన సినిమా దుమ్ముదులుపుతోంది. విడుదలైన 3 రోజులకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. తన తొలి సినిమాకే వైష్ణవ్ తేజ్, మార్కెట్ పరంగా స్టార్ అయిపోయాడు. అటు బుచ్చిబాబు ఆనందానికి హద్దుల్లేవు. మొదటి సినిమా ఇంత సక్సెస్ అవుతుందని కలలో కూడా ఊహించని ఆ దర్శకుడు.. ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంటున్నాడు.

ఇక ఉప్పెన వారాంతం వసూళ్ల విషయానికొస్తే.. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 28 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పాతిక కోట్లు వచ్చాయి. అలా ఈ సినిమా 3 రోజులకే అన్ని సెంటర్లలో బ్రేక్ ఈవెన్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 రోజుల్లో ఉప్పెన సినిమాకు వచ్చిన షేర్లు (కోట్లలో) ఇలా ఉన్నాయి

నైజాం – 8.53
ఉత్తరాంధ్ర – 4.12
ఈస్ట్ – 2.36
వెస్ట్ – 1.53
కృష్ణా – 1.76
గుంటూరు – 2.07
నెల్లూరు – 86.4 లక్షలు
సీడెడ్ – 3.7

First Published:  15 Feb 2021 5:47 AM GMT
Next Story