Telugu Global
Cinema & Entertainment

కార్పొరేట్ విద్యపై 'అక్షరా'యుధం

నందితా శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అక్షర’ సినిమా ఈ నెల 26న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. రెండు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రిలీజ్ చేశాడు. సినిమాలోని మెయిన్ కంటెంట్ ను ట్రయిలర్ లో రివీల్ చేశారు. విద్యారంగంలో జరుగుతున్న అవినీతిపై ఒక ఉపాధ్యాయురాలు చేసే పోరాటం ఆధారంగా తెరకెక్కింది అక్షర. సినిమాలో నందితా శ్వేతా క్యారెక్టర్ ఎంత […]

కార్పొరేట్ విద్యపై అక్షరాయుధం
X

నందితా శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అక్షర’ సినిమా ఈ నెల 26న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ
సందర్భంగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. రెండు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ను
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రిలీజ్ చేశాడు.

సినిమాలోని మెయిన్ కంటెంట్ ను ట్రయిలర్ లో రివీల్ చేశారు. విద్యారంగంలో జరుగుతున్న అవినీతిపై
ఒక ఉపాధ్యాయురాలు చేసే పోరాటం ఆధారంగా తెరకెక్కింది అక్షర.

సినిమాలో నందితా శ్వేతా క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉండనుందో ట్రైలర్ లో సీన్స్ చూస్తే తెలుస్తోంది.
సినిమాలో ఉన్న కొన్ని హైలైట్ సీన్స్ ను ట్రైలర్ లో జత చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు. ముఖ్యంగా
సురేష్ బొబ్బిలి మ్యూజిక్ , నాగేష్ బనేల్ సినిమాటోగ్రఫీ హైలైట్ అనిపించాయి. డైరెక్టర్ చిన్ని కృష్ణ టేకింగ్
, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

“చదువన్నది ఈ దేశంలో ప్రతీ పౌరుడికి ప్రాధమిక హక్కు.. దాన్ని డబ్బుతో కొనుక్కోవడం తప్పు”, భూమి
ని నమ్ముకున్నోడు రైతు..చదువును నమ్ముకున్నోడు రాజు” అంటూ హర్ష వర్ధన్ చెప్పే డైలాగ్స్ సినిమాలో
ఉన్న డెప్త్ ని తెలియజేసేలా ఉన్నాయి.

First Published:  16 Feb 2021 8:19 AM GMT
Next Story