Telugu Global
Cinema & Entertainment

నాగార్జన కొత్త సినిమా లాంఛ్

ఎట్టకేలకు నాగార్జున నుంచి మరో మూవీ వస్తోంది. అది కూడా ఆగిపోయిందనుకున్న సినిమాను లాంఛ్ చేశాడు నాగ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నాగ్. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడీ సినిమా మళ్లీ పట్టాలపైకి వచ్చింది. ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై నిర్మాత‌లు నారాయణదాస్ […]

నాగార్జన కొత్త సినిమా లాంఛ్
X

ఎట్టకేలకు నాగార్జున నుంచి మరో మూవీ వస్తోంది. అది కూడా ఆగిపోయిందనుకున్న సినిమాను లాంఛ్
చేశాడు నాగ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నాగ్.
అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడీ సినిమా
మళ్లీ పట్టాలపైకి వచ్చింది. ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది.

శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై
నిర్మాత‌లు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి ఈ భారీ బడ్జెట్
చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతానికి పూజా కార్యక్రమాలు మాత్రమే నిర్వహించారు. హీరోయిన్,
మ్యూజిక్ డైరక్టర్, ఇతర పాత్రల వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.

ఇదొక స్టైలిష్ యాక్ష‌న్ ఫిలిం అంటున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తార్. త్వరలోనే హైద‌రాబాద్‌లో 10
రోజుల పాటు షూటింగ్ జ‌రిపి మార్చిలో గోవాలో 15 రోజులు షూటింగ్‌ ప్లాన్ చేశారు.. ఆ త‌ర్వాత ఊటీ,
లండ‌న్‌లో షూటింగ్ జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్స్ తో పాటు సౌత్ కొరియాలో నాలుగు రోజులు షూటింగ్
ప్లాన్ చేశారు.

First Published:  16 Feb 2021 8:23 AM GMT
Next Story