Telugu Global
Cinema & Entertainment

వాయిదాపడిన వరుణ్ తేజ్ మూవీ

హీరోలంతా వరుసగా తమ సినిమాల విడుదల తేదీల్ని ప్రకటిస్తున్న నేపథ్యంలో.. హీరో వరుణ్ తేజ్ కూడా తన కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించాడు ఆమధ్య. అయితే ఆ రిలీజ్ డేట్ ను ఇలా ప్రకటించి, ఇప్పుడు వెంటనే వాయిదా వేశారు. ఎందుకిలా జరిగిందో చూద్దాం. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమాను జులై 30న విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రభాస్ తన కొత్త సినిమా రాధేశ్యామ్ […]

వాయిదాపడిన వరుణ్ తేజ్ మూవీ
X

హీరోలంతా వరుసగా తమ సినిమాల విడుదల తేదీల్ని ప్రకటిస్తున్న నేపథ్యంలో.. హీరో వరుణ్ తేజ్ కూడా
తన కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించాడు ఆమధ్య. అయితే ఆ రిలీజ్ డేట్ ను ఇలా ప్రకటించి,
ఇప్పుడు వెంటనే వాయిదా వేశారు. ఎందుకిలా జరిగిందో చూద్దాం.

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమాను జులై 30న విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రభాస్ తన కొత్త సినిమా రాధేశ్యామ్ రిలీజ్ కోసం అదే తేదీని ప్రకటించాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య గని సినిమాను వాయిదా వేశారు నిర్మాతలు.

రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా అప్పీల్ తో వస్తోంది. ఆ మూవీపై భారీ అంచనాలున్నాయి. పైగా ఎక్కువ థియేటర్లలో వస్తోంది. అలాంటి సినిమాకు పోటీగా గనిని బాక్సాఫీస్ బరిలో దింపడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే పైకి చెప్పకపోయినా, అనధికారంగా తమ సినిమాను వాయిదా వేసుకున్నారు నిర్మాతలు.

First Published:  16 Feb 2021 8:16 AM GMT
Next Story