‘నాంది’ నా సమాధానం

తెలుగులో సహజసిద్ధంగా ఉండే సినిమాలు రావా? నేచురల్ కంటెంట్ తెలుగులో ఎందుకు కనిపించదు.
ఈ ప్రశ్నలకు సమాధానమే నాంది సినిమా అంటున్నాడు అల్లరి నరేష్.

“నా రెగ్యులర్ కామెడీ జోనర్ నుండి పక్కకి వచ్చి కొత్తగా చేసిన సినిమా ‘నాంది’. మీ కామెడీ మొనాటనీ
అవుతోంది. రొటీన్ సినిమాలు చేయకండి కొత్తగా చేయండి అని కొంత మంది చెప్పారు. అలాగే ఈ లాక్
డౌన్ లో చాలా మంది మలయాళం సినిమాలు చూస్తూ నేచురాలిటీ కంటెంట్ తో ఉండే ఇలాంటి
సినిమాలు మన తెలుగులో రావు అనుకున్నారు. వీటన్నిటికి నా సమాధానం ‘నాంది’.

సినిమా నేచురల్ గా ఉండడంతో పాటు ఓ బలమైన పాయింట్ ను డిస్కస్ చేశామని చెబుతున్నాడు
అల్లరోడు. చట్టానికి సంబంధించిన ఓ సెక్షన్ గురించి ఈ సినిమాలో చర్చించామని, చాలామంది లాయర్స్
తో మాట్లాడిన తర్వాత ఈ కథను దర్శకుడు రాశాడని చెప్పుకొచ్చాడు.

“సినిమాలో ఎవరికీ తెలియని ఒక సెక్షన్ గురించి డిస్కస్ చేశాము. ఆ విషయం గురించి మాట్లాడే ముందు
డైరెక్టర్ దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. తను చాలా మంది లాయర్స్ ని కలిసి ఎక్కడా మిస్టేక్
లేకుండా పక్కగా ఉండేలా కథను సిద్దం చేసుకున్నాడు. ఆ సెక్షన్ గురించి సినిమా చూసాక అందరు
గూగుల్ చేస్తారు. అదేంటనేది 19న తెలుస్తుంది.”

సినిమాల విషయంలో తన తొలి ప్రాధాన్యం కామెడీకే ఇస్తానని, కానీ మధ్యమధ్యలో నాంది లాంటి కథలు
దొరికితే తప్పకుండా చేస్తానంటున్నాడు ఈ హీరో.