ఆ ప్రచారం కూడా పనిచేయలేదు

తమ సినిమాకు ప్రచారం కల్పించేందుకు నిర్మాతలు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. సంప్రదాయంగా
చేసే ప్రమోషన్ తో పాటు కొందరు సినిమాపై హైప్ తెచ్చేందుకు వివాదాలు సృష్టిస్తే.. మరికొందరు ఎఫైర్లు
క్రియేట్ చేస్తుంటారు. అయితే ఓ నిర్మాత మాత్రం తన సినిమా ప్రమోషన్ కోసం, ఏకంగా సినిమానే
యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు.

గతవారం రిలీజైన సినిమాల్లో ఎఫ్.సీ.యూ.కే కూడా ఒకటి. జగపతిబాబు లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా
ఉప్పెన ధాటికి కొట్టుకుపోయింది. నిజానికి ఉప్పెన బరిలో లేకపోయినా ఈ సినిమా కొట్టుకుపోయే మూవీనే.
ఇప్పుడీ సినిమా వైపు మరింత మంది ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు నిర్మాతలు వినూత్న ప్రయత్నం
చేశారు.

గత ఆదివారం ఎఫ్.సీ.యూ.కే సినిమాను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఏకంగా 24 గంటల పాటు
సినిమాను ఉంచారు. యూట్యూబ్ లో చూసిన జనాలు, మరో నలుగురికి చెబుతారని, ఆ తర్వాత
థియేటర్లకు జనం పోటెత్తుతారని నిర్మాతలు భావించారు. కానీ ఈ ప్రయోగం పనిచేయలేదు.
ఎఫ్.సీ.యూ.కే సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు.

నిజానికి ఆ సినిమాను యూట్యూబ్ లో పెట్టి మేకర్స్ చాలా తప్పుచేశారు. సినిమా ఓ రేంజ్ లో పైరసీ
అయిపోయింది. థియేటర్లకు వెళ్లకుండా అంతా తమ మొబైల్స్ లో ఈ సినిమాను చూసేస్తున్నారు.