Telugu Global
National

కొంపముంచిన పార్టీ.. ఒకేసారి 103 మందికి కరోనా

కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయింది అన్నట్టుగా అందరూ లైట్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతునే ఉన్నాయి. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేపడుతునే ఉన్నాయి. అయితే కనీస జాగ్రత్తలు కూడా పాటించమని కోరుతున్నా కొంతమంది నిర్లక్ష్యం చేయడంతో.. కరోనా పంజా విసురుతోంది. తాజాగా ఒక అపార్ట్ మెంట్ లో ఒకేసారి 103 మందికి కరోనా సోకింది. జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసుల సంఖ్య తెలియకుండానే పెరుగుతుంది. తాజాగా బెంగళూరులో..ఓ […]

కొంపముంచిన పార్టీ.. ఒకేసారి 103 మందికి కరోనా
X

కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయింది అన్నట్టుగా అందరూ లైట్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతునే ఉన్నాయి. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేపడుతునే ఉన్నాయి. అయితే కనీస జాగ్రత్తలు కూడా పాటించమని కోరుతున్నా కొంతమంది నిర్లక్ష్యం చేయడంతో.. కరోనా పంజా విసురుతోంది. తాజాగా ఒక అపార్ట్ మెంట్ లో ఒకేసారి 103 మందికి కరోనా సోకింది.

జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసుల సంఖ్య తెలియకుండానే పెరుగుతుంది. తాజాగా బెంగళూరులో..ఓ అపార్ట్ మెంట్ లో 103 మందికి కరోనా సోకడం కలకలం రేపింది. 465 ప్లాట్లు ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో మొత్తం 1500 మంది వరకు నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ లో వివాహానికి సంబంధించిన పార్టీలు జరిగిన కొద్ది రోజులకే ఒకేసారి 103 కేసులు నమోదయ్యాయి. పార్టీలో పాల్గొన్న వారిలో కొంతమందికి ఆరోగ్యం బాగోపోవడంతో.. అందరికీ టెస్టులు నిర్వహించారు. వెయ్యి మందికి టెస్టులు నిర్వహించగా అందులో 103 మందికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. మరో 500 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. ఇలా ఒకే అపార్ట్ మెంట్ లో 100 మందికి పైగా కరోనా బారిన పడడంతో కర్నాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ హోమ్ ఐసోలేషన్ చేశారు.

మన దగ్గర కూడా చాలామంది జాగ్రత్తలను నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం మాస్క్ కూడా పెట్టుకోవడం లేదు. కనీసం ఇలాంటివి చూసైనా కాస్త అప్రమత్తంగా ఉండాలని వైరస్ పూర్తిగా కంట్రోల్ అయ్యేవరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

First Published:  17 Feb 2021 6:17 AM GMT
Next Story