మెహ్రీన్ ప్రేమ కబుర్లు

హీరోయిన్ మెహ్రీన్ తన ప్రేమను బయటపెట్టింది. భవ్య బిష్ణోయ్ అనే వ్యక్తితో ప్రస్తుతం ఈమె లవ్ లో
ఉంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య. ప్రస్తుతం భవ్య తండ్రి కాంగ్రెస్
ఎమ్మెల్యే.

తామిద్దరం ఎక్కడ, ఎలా కలిశామనే విషయాన్ని మెహ్రీన్ వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రేమలో ఉన్నామనే
విషయాన్ని మాత్రమే బయటపెట్టింది. వచ్చేనెల 12న వీళ్ల ఎంగేజ్ మెంట్. జైపూర్ లోని ఓ రిసార్ట్ లో
మెహ్రీన్-భవ్య నిశ్చితార్థం ఉంటుంది. ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా.

తెలుగులో కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది మెహ్రీన్. రాజా ది గ్రేట్, ఎఫ్2
లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె ఎఫ్3 సినిమా చేస్తోంది. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు
సినిమాలు ఆపేయాలని అనుకుంటోందట ఈ బ్యూటీ.