‘అన్నపూర్ణ’తో వైష్ణవ్ తేజ్

మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో వైష్ణవ్ తేజ్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తన
రెండో సినిమాను క్రిష్ దర్శకత్వంలో పూర్తిచేసిన ఈ హీరో, ఇప్పుడు మూడో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్
ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్, తన మూడో సినిమాను అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా చేసే
ఛాన్స్ ఉంది.

ప్రస్తుతానికి ఈ సినిమా గురించి అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు కానీ త్వరలోనే
అఫీషియల్ గా వైష్ణవ్ తేజ్ తో సినిమా అంటూ ప్రకటించే ఆలోచనలో ఉన్నారట. తొలి సినిమా ‘ఉప్పెన’
గ్రాండ్ సక్సెస్ తో మంచి జోష్ మీదున్న వైష్ణవ్ తేజ్ కు.. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ తో పాటు మరికొన్ని బేనర్స్ నుండి సినిమా కోసం అడ్వాన్సులు వెళ్లాయట.

మరోవైపు వైష్ణవ్ తో ఉప్పెన సినిమా తీసిన మైత్రీ నిర్మాతలు కూడా అతడితో మరో సినిమా ప్లాన్
చేస్తున్నారు. త్వరలోనే ఆ సినిమా ప్రకటన రాబోతోంది.