ఇషా చావ్లా రీఎంట్రీ

లాంగ్ గ్యాప్ తర్వాత ఇషా చావ్లా మళ్లీ సినిమాల్లోకొచ్చింది. గతంలో అల్లరినరేష్, బాలకృష్ణ, ఆది లాంటి
హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ.. రీఎంట్రీలో మరింత అందంగా తయారై వచ్చింది. ఆమె నటిస్తున్న
తాజా చిత్రం అగోచర.

క‌మ‌ల్ కామ‌రాజు, ఇషా చావ్లా హీరో హీరోయిన్లుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ తొలిసారి
ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న చిత్రం `అగోచ‌ర`. స్పానిష్ థ్రిల్లర్ చిత్రం జూలియా ఐస్ స్పూర్తితో ఈ మూవీ
రూపొందుతోంది. ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని
అందమైన ప్రదేశాలలో ప్రారంభ‌మైంది. గడ్డకట్టే చల్లటి వాతావరణ పరిస్థితుల్లో ఈ చిత్రం షూటింగ్
జరుపుకుంటోంది.

హైలెట్ ఏంటంటే.. ఈ సినిమాలో ఇషా చావ్లా డ‌బుల్ రోల్‌లో న‌టించ‌డం. ఆమె పాత్ర‌లోని భిన్న ఛాయ‌లు ఆడియ‌న్స్‌ని ప్రతి క్షణం థ్రిల్ చేసేలా ఉంటాయట. కమల్ కామరాజు ఆమెకు మద్దతు ఇచ్చే భర్త పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా ఉండనుంది.