పాగల్ టీజర్ రివ్యూ

హీరో విష్వ‌క్ సేన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘పాగ‌ల్’‌. న‌రేష్ కుప్పిలి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని శ్రీ వేంక‌టేశ్వ‌ర
క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్పిస్తుండ‌గా, ల‌క్కీ మీడియా ప‌తాకంపై బెక్కెం వేణుగోపాల్
నిర్మిస్తున్నారు.

ఈరోజు ‘పాగ‌ల్’ టీజ‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ టీజ‌ర్‌లో విష్వ‌క్ సేన్ డాషింగ్‌గా
క‌నిపిస్తున్నాడు. టైటిల్‌కు త‌గ్గ‌ట్లే ఆయ‌న క్యారెక్ట‌ర్‌లో డిఫ‌రెంట్ షేడ్స్ క‌నిపిస్తున్నాయి. హీరో
క్యారెక్టరైజేషన్ ఏంటనే విషయాన్ని టీజర్ లో క్లియర్ గా చెప్పారు.

టీజ‌ర్ చివ‌ర‌లో రాహుల్ రామ‌కృష్ణ‌తో, చెప్పించిన కామెడీ డైలాగ్ టీజర్ కు మంచి ఫినిషింగ్ టచ్
ఇచ్చింది. విష్వ‌క్ సేన్ క్యారెక్ట‌ర్‌లో ఓ ల‌వ‌ర్‌తో పాటు ఫెరోషియ‌స్ ప‌ర్స‌న్ కూడా ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

టీజ‌ర్‌లో హీరోయిన్ సిమ్రాన్ చౌద‌రి అందంగా క‌నిపిస్తే, ముర‌ళీ శ‌ర్మ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. ర‌ధ‌న్
బ్యాగ్రౌండ్ స్కోర్‌, ఎస్‌. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ ఇంప్రెసివ్‌గా క‌నిపిస్తున్నాయి. నిర్మాణ విలువ‌లు
బాగున్నాయి. స‌మ్మ‌ర్ కానుక‌గా ‘పాగ‌ల్’ ఏప్రిల్ 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది.