6 నెలల్లో 3 సినిమాలు రిలీజ్

పెద్ద హీరోలు ఏడాదికి ఒక సినిమా చేస్తున్న రోజులివి. ఓ బడా హీరో నుంచి ఏడాదికి 2 సినిమాలొస్తే అది
చాలా పెద్ద విషయం. కానీ నితిన్ నుంచి ఈ ఏడాది ఏకంగా 3 సినిమాలు వస్తున్నాయి. కుదిరితే 4 వచ్చినా
ఆశ్చర్యపోనక్కర్లేదు.

“ఫిబ్రవరి 26న చెక్ వస్తోంది. మార్చి 26న రంగ్ దే వస్తోంది. జూన్ 11న అంధాధూన్ రీమేక్ ను రిలీజ్
చేస్తున్నాం. మే నెల నుంచి పవర్ పేట స్టార్ట్ చేస్తాను. వీలైతే దాన్ని కూడా ఈ ఏడాదిలో డిసెంబర్ లో
రిలీజ్ చేయాలనుకుంటున్నాం.”

ఇలా తన సినిమాల రిలీజ్ డేట్స్ ను బయటపెట్టాడు నితిన్. కెరీర్ లో ఇప్పటివరకు తన నుంచి ఒకే
ఏడాది ఇలా ఇన్ని సినిమాలు రాలేదని… తనకే కాస్త ఆశ్చర్యంగా ఉందని చెబుతున్నాడు. మరీ ముఖ్యంగా
ఏడాది తొలి 6 నెలల్లోనే తన నుంచి 3 సినిమాలు రావడం హ్యాపీగా ఉందంటున్నాడు.