మరో షెడ్యూల్ పూర్తిచేసిన ఎఫ్3

సినిమాలు చకచకా పూర్తిచేయడంలో అనీల్ రావిపూడి దిట్ట. ఇచ్చిన బడ్జెట్ లో వీలైనంత త్వరగా తన
ప్రాజెక్టులు పూర్తిచేస్తుంటాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఎఫ్3 సినిమాను కూడా అలానే పూర్తిచేస్తున్నాడు.
మల్టీస్టారర్ మూవీ అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా అన్ని షెడ్యూల్స్ చకచకా కంప్లీట్ చేస్తున్నాడు.

ఇందులో భాగంగా తాజాగా మరో భారీ షెడ్యూల్ పూర్తిచేశాడు ఈ దర్శకుడు. వరుణ్ తేజ్, వెంకటేష్,
సునీల్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు పూర్తయ్యాయి. అంతకంటే ముందు వరుణ్, వెంకీ, తమన్న
కాంబినేషన్ లో సీన్లు పూర్తయ్యాయి.

అటు మెహ్రీన్ కూడా ఈ సినిమాకు ఫుల్ గా కాల్షీట్లు కేటాయించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు
అందుబాటులోకి వస్తోంది. ఇలా నటీనటులంతా సహకారం అందిస్తుండడంతో అనీల్ రావిపూడి పని
మరింత ఈజీ అయిపోయింది.

ఎఫ్3 సినిమా విడుదల తేదీని ఆల్రెడీ ప్రకటించారు. ఆగస్ట్ 27ను ఈ సినిమాను థియేటర్లలోకి
తీసుకురాబోతున్నారు. అందుకే ఆ తేదీని అందుకునేందుకు ఇలా రాత్రిపగలు కష్టపడుతున్నారు.