మళ్లీ మొదలైన లైగర్

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లైగర్. కరోనా కారణంగా
ఈ సినిమా ముంబయి షెడ్యూల్ ఆగిపోయింది. సినిమాకు వర్క్ చేయాల్సిన ఎక్కువమంది ఫారిన్
టెక్నీషియన్స్ ఇండియాకు తిరిగి రాలేకపోయారు. అలా చాన్నాళ్లుగా ఆగిపోయిన ఈ సినిమా మళ్లీ సెట్స్
పైకి వచ్చింది.

లైగర్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ కూడా ముంబయిలోనే స్టార్ట్ అయింది. దీనికి
సంబంధించిన స్టిల్స్ ను నిర్మాత చార్మి రిలీజ్ చేసింది. సెట్స్ లో రమ్యకృష్ణతో మాట్లాడుతున్న ఫొటోల్ని,
విజయ్ దేవరకొండతో బైక్ పై షికారు చేస్తున్న పిక్స్ ను చార్మి విడుదల చేసింది.

విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది లైగర్. అనన్య
పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను, పూరి-ఛార్మితో కలిసి కరణ్ జోహార్
నిర్మిస్తున్నాడు. లైగర్ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.