ఆర్ఆర్ఆర్ సెట్స్ లో పవర్ స్టార్

సెట్స్ పైకి అనుకోని అతిథి వస్తే ఎవరికైనా ఆశ్చర్యమే. అలాంటి ఆశ్చర్యాన్నే అందించాడు హీరో పవన్
కల్యాణ్. తన బిజీ షెడ్యూల్స్ ను పక్కనపెట్టి, సడెన్ గా ఆర్ఆర్ఆర్ సెట్స్ లో ప్రత్యక్షమయ్యాడు.
ఊహించని విధంగా పవన్ కల్యాణ్ సెట్స్ కు రావడంతో అంతా సంతోషపడ్డారు.

అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబందించి భారీ యాక్షన్ పార్ట్ షూటింగ్ జరుగుతోంది.
అదే సెట్స్ లో తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు పవన్. ఆర్ఆర్ఆర్ షూట్ భారీ స్థాయిలో
జరుగుతోందని తెలుసుకొని, తన సినిమాను పక్కనపెట్టి మరీ ఆర్ఆర్ఆర్ సెట్స్ కు వచ్చాడు పవన్.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ విశేషాల్ని దర్శకుడు రాజమౌళి, పవన్ కు వివరించాడు. ఇద్దరూ కలిసి దాదాపు 20
నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అదే సెట్స్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఉన్నారు. వాళ్లతో కూడా
పవన్ కల్యాణ్ మాట్లాడాడు. ఆర్ఆర్ఆర్ సెట్స్ కు పవన్ వచ్చిన విషయాన్ని మేకర్స్ సీక్రెట్ గా ఉంచారు.
బహుశా, ప్రమోషన్ టైమ్ లో ఆ స్టిల్స్, వీడియోను వాడుకుంటారేమో.