Telugu Global
National

ఈ పాపం బీజేపీదే.. కేంద్రంపై మండిపడ్డ కాంగ్రెస్​ సీఎం..!

పెట్రోల్​ ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రధాని మోదీ ఈ అంశంపై మాట్లాడుతూ.. పెట్రోలు ధరలు పెరగడానికి కారణం గతంలో కాంగ్రెస్​ పార్టీయే కారణమని విమర్శించారు. అయితే తాజాగా మోదీ వ్యాఖ్యలకు రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాత్ కౌంటర్​ ఇచ్చారు. పెట్రో ధరల పాపం మొత్తం కేంద్రానిదేనని ఆయన చురకలంటించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ట్వీట్​ చేశారు. ఆయన ట్విట్టర్​ ద్వారా ఏం చెప్పారంటే.. […]

ఈ పాపం బీజేపీదే.. కేంద్రంపై మండిపడ్డ కాంగ్రెస్​ సీఎం..!
X

పెట్రోల్​ ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రధాని మోదీ ఈ అంశంపై మాట్లాడుతూ.. పెట్రోలు ధరలు పెరగడానికి కారణం గతంలో కాంగ్రెస్​ పార్టీయే కారణమని విమర్శించారు. అయితే తాజాగా మోదీ వ్యాఖ్యలకు రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాత్ కౌంటర్​ ఇచ్చారు. పెట్రో ధరల పాపం మొత్తం కేంద్రానిదేనని ఆయన చురకలంటించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ట్వీట్​ చేశారు.

ఆయన ట్విట్టర్​ ద్వారా ఏం చెప్పారంటే.. ‘పెట్రోల్​ ధరల పాపం మొత్తం కేంద్రానిదే. 2014లో యూపీఏ హయాంలో ఎక్సైజ్​ సుంకం లీటర్​ పెట్రోల్​పై రూ. 9.20, డీజిల్​పై రూ. 3.46 ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పెట్రోల్​పై రూ. 32.90, డీజిల్​ పై రూ. 31.82 ఎక్సైజ్​ సెస్​ విధిస్తున్నారు.’ ఇలా చేయడం వల్లే పెట్రోల్, డీజిల్​ ధరలు పెరిగాయని ఆయన వాపోయారు.

ఈ దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడంలో మోదీ ఫెయిల్​ అయ్యారని ఆరోపించారు. రాష్ట్రాలపై భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోలు, డీజిల్​ ధరలు తగ్గించాలని డిమాండ్​ చేశారు. నోరెత్తిన వాళ్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బీజేపీ నేతలు పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.

డీజిల్​, పెట్రోల్​ ధరలు పెరుగుతుండటంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసంతృప్తి నెలకొన్నది. సోషల్​మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా శనివారం కూడా పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. పెట్రోల్​పై 39 పైసలు, డీజిల్​ పై 37 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 90.58, డీజిల్​ ధర రూ. 80.97 రూపాయలుగా ఉంది.

First Published:  20 Feb 2021 9:24 AM GMT
Next Story