దృశ్యం-2 రీమేక్ లో వెంకటేష్

మలయాళంలో సూపర్ హిట్టయిన దృశ్యం సినిమాను అదే పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు వెంకటేష్. ఇప్పుడు మలయాళంలో దృశ్యం-2 కూడా సూపర్ హిట్టయింది. ఇప్పుడీ సినిమాను కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ఈ హీరో.

దృశ్యంలో కేబుల్ ఆపరేటర్ గా కనిపించిన మోహన్ లాల్. సీక్వెల్ లో ఏకంగా థియేటర్ ఓనర్ అవుతాడు. మరోవైపు పోలీసులు మాత్రం అతడిపై ఓ కన్నేసి ఉంచుతారు. మోహన్ లాల్, మీన ధైర్యంగా ఉన్నప్పటికీ.. పిల్లలు మాత్రం ఎప్పట్లానే భయపడుతూ ఉంటారు. ఈ క్రమంలో మరోసారి మోహన్ లాల్, పోలీసుల నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది దృశ్యం-2లో చూపించారు.

అద్భుతమైన స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో తెరకెక్కిన సీక్వెల్.. అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. విమర్శకులు ఈ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో దృశ్యం2పై కన్నేశాడు సురేష్ బాబు. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు.