మరో సినిమా వాయిదా

సినిమా రిలీజ్ డేట్స్ అన్నీ వరుసగా ప్రకటిస్తున్నప్పుడే చాలామంది అనుమానించారు. ఆ అనుమానమే ఇప్పుడు నిజమైంది. ఇప్పటికే పలు సినిమాలు వాయిదా బాటపట్టాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి సందీప్ కిషన్ సినిమా కూడా చేరింది.

సందీప్ కిషన్ కొత్త సినిమా ఏ1-ఎక్స్ ప్రెస్. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఈనెల 26న విడుదల చేయబోతున్నట్టు గతంలో ఘనంగా ప్రకటించారు. కట్ చేస్తే, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తికాలేదు. దీంతో ఈ సినిమాను మరో వారం వాయిదా వేసి మార్చి 5కు రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.

టాలీవుడ్ లో హాకీ కాన్సెప్ట్ తో వస్తున్న మొట్టమొదటి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది ఏ1-ఎక్స్ ప్రెస్. ఇందులో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ హాకీ ప్లేయర్స్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 2 సాంగ్స్ కూడా హిట్టయ్యాయి. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు సందీప్ కిషన్.