Telugu Global
Cinema & Entertainment

పవర్ ప్లే రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న గ్రాండ్‌గా విడుద‌ల‌చేయ‌నున్నారు. ఇంతకుముందు రాజ్ తరుణ్, విజయ్ కుమార్ కొండా కలిసి ఒరేయ్ బుజ్జిగా సినిమా చేశారు. ఆ వెంటనే ఇలా థ్రిల్లర్ సబ్జెక్ట్ తో […]

పవర్ ప్లే రిలీజ్ డేట్ ఫిక్స్
X

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'పవర్ ప్లే'. వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా
నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.
ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న గ్రాండ్‌గా విడుద‌ల‌చేయ‌నున్నారు.

ఇంతకుముందు రాజ్ తరుణ్, విజయ్ కుమార్ కొండా కలిసి ఒరేయ్ బుజ్జిగా సినిమా చేశారు. ఆ వెంటనే
ఇలా థ్రిల్లర్ సబ్జెక్ట్ తో పవర్ ప్లే సినిమా చేశారు. ఈ సినిమా డెఫినెట్‌గా అంద‌ర్నీ థ్రిల్ చేస్తుందని
నమ్మకంగా చెబుతున్నాడు హీరో.

రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌,
కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
నంధ్యాల రవి కథ అందించాడు. డైలాగ్స్ కూడా అతడివే. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం
సమకూర్చాడు

First Published:  21 Feb 2021 4:58 AM GMT
Next Story