సీటీమార్ టీజర్ రివ్యూ

గోపిచంద్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న సీటీమార్ మూవీ టీజ‌ర్‌ను ఈ రోజు రిలీజ్ చేశారు.
యాక్ష‌న్ చెప్ప‌గానే క‌బ‌డ్డీ, క‌బ‌డ్డీ,క‌బ‌డ్డీ అంటూ మొద‌లైన 70 సెకెన్ల నిడివిగ‌ల ఈ టీజ‌ర్ ఆధ్యంతం
ఉత్కంఠభరితంగా సాగింది.

రేయ్ కార్తి‌..అంటూ రావు ర‌మేష్ పిల‌వ‌గానే `న‌న్నెవ‌డైనా అలా పిల‌వాలంటే ఒక‌టి మా ఇంట్లో వాళ్లు
పిల‌వాలి లేదా నా ప‌క్క‌నున్న ఫ్రెండ్స్ పిల‌వాలి..ఎవ‌డు ప‌డితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది` అంటూ
గోపిచంద్ చెప్పే డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. అలాగే `క‌బ‌డ్డీ మైదానంలో ఆడితే ఆట..బ‌య‌ట
ఆడితే వేట` అనే డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. గోపీచంద్ సీటీ వేయ‌డంతో ఈ టీజ‌ర్ ముగుస్తుంది.

టీజర్ లో సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్ గా
నిలిచింది. భూమిక కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో తమన్న హీరోయిన్. ఏప్రిల్ 2న థియేటర్లలోకి
రానుంది సీటీమార్.