Telugu Global
Business

ఆండ్రాయిడ్ 12 వచ్చేస్తోంది

ఈ ఏడాది గూగుల్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ 'ఆండ్రాయిడ్ 12' ను తీసుకురాబోతుంది. ఇందులో మరిన్ని లేటెస్ట్ ఫీచర్లతో పాటు, అప్‌డేటెడ్ డేటా ప్రైవసీ ఆప్షన్లను తీసుకురానుంది. ఆండ్రాయిడ్ 12 ఎలా ఉండబోతుందంటే.. ఆండ్రాయిడ్‌ 12 కు 'షోకోన్' అనే పేరు పెట్టబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Android 12
X

ఈ ఏడాది గూగుల్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ 'ఆండ్రాయిడ్ 12' ను తీసుకురాబోతుంది. ఇందులో మరిన్ని లేటెస్ట్ ఫీచర్లతో పాటు, అప్‌డేటెడ్ డేటా ప్రైవసీ ఆప్షన్లను తీసుకురానుంది. ఆండ్రాయిడ్ 12 ఎలా ఉండబోతుందంటే..


ఆండ్రాయిడ్‌ 12 కు 'షోకోన్' అనే పేరు పెట్టబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో కొత్తగా వన్‌హ్యాండ్‌ మోడ్‌ అంటే ఒకచేత్తోనే ఫోన్‌ని ఆపరేట్‌ చేసేందుకు వీలుగా ఫీచర్‌ అందుబాటులోకి రానున్నది. ఈ కొత్త వెర్షన్ లో హెవీ యాప్స్ కూడా స్మూత్‌గా రన్‌ అవుతాయి. నోటిఫికేషన్ల డిజైన్ కూడా డిఫరెంట్‌గా ఉండనుంది.


అన్నింటికంటే ముఖ్యంగా సెక్యూరిటీ, ప్రైవసీకి సంబంధించి గూగుల్‌ కొత్త ఫీచర్లను తీసుకురానుంది. ఇకపోతే మొబైల్స్‌తో పాటు టీవీలు, ఫోల్డ్‌బుల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్‌లలో ఆండ్రాయిడ్‌ 12 మరింత మెరుగ్గా అప్‌డేట్ అవ్వనుంది. ఆండ్రాయిడ్ 12 లో పాత వాడిన థీమ్స్‌ రంగులకు భిన్నంగా కొత్త థీమ్స్‌ పరిచయం చేయనున్నారు. వీటితో పాటు ఇందులో హెప్టిక్‌-కపుల్డ్‌ ఆడియో ఎఫెక్ట్‌తో మ్యూజిక్‌, గేమింగ్‌ అనుభూతి మెరుగ్గా ఉండనుంది.

First Published:  22 Feb 2021 3:30 AM GMT
Next Story