Telugu Global
National

రూటుమార్చిన రాహుల్, ప్రియాంక..! ప్రచారంలో వైవిధ్యం..!

కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకాగాంధీ రూటు మార్చారు. ‘రాజకీయ నేతలంటే ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు.. హెలికాప్టర్​లో దిగుతారు.. ప్రజలకు ఓ లుక్​ ఇచ్చి పోతారు. బహిరంగసభల్లో ఉపన్యాసాలు ఇస్తారు’ ఇటువంటి అభిప్రాయం ఉండేది. కాంగ్రెస్​ అగ్ర నేతలపై అటువంటి అభిప్రాయం ఎక్కువ. అయితే రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ కాస్త రూటు మార్చారు. నేరుగా ప్రజల మధ్యల్లోకి వెళ్తున్నారు. వ్యవసాయకూలీలు.. కులవృత్తులు చేసేవాళ్ల ఇళ్లల్లోకి, వాళ్ల పనిప్రదేశంలోకి వెళ్తున్నారు. వాళ్లు చేసే పనులను తెలుసుకుంటున్నారు. […]

రూటుమార్చిన రాహుల్, ప్రియాంక..! ప్రచారంలో వైవిధ్యం..!
X

కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకాగాంధీ రూటు మార్చారు. ‘రాజకీయ నేతలంటే ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు.. హెలికాప్టర్​లో దిగుతారు.. ప్రజలకు ఓ లుక్​ ఇచ్చి పోతారు. బహిరంగసభల్లో ఉపన్యాసాలు ఇస్తారు’ ఇటువంటి అభిప్రాయం ఉండేది. కాంగ్రెస్​ అగ్ర నేతలపై అటువంటి అభిప్రాయం ఎక్కువ. అయితే రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ కాస్త రూటు మార్చారు. నేరుగా ప్రజల మధ్యల్లోకి వెళ్తున్నారు. వ్యవసాయకూలీలు.. కులవృత్తులు చేసేవాళ్ల ఇళ్లల్లోకి, వాళ్ల పనిప్రదేశంలోకి వెళ్తున్నారు. వాళ్లు చేసే పనులను తెలుసుకుంటున్నారు. వాళ్ల జీవన విధానం ఎంత దుర్భరంగా ఉంటుందో దగ్గరుండి ఆరాతీస్తున్నారు. తద్వారా ప్రజల ఆదరణ చూరగొంటున్నారు.

ఇటీవల రాహుల్​, ప్రియాంక ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. దీంతో కాంగ్రెస్​ కార్యకర్తలు సైతం సంబురాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఫలితాలు రాబోతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలపై కాంగ్రెస్​ నేతలు దృష్టిసారించారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ప్రియాంక గాంధీ సోమ, మంగళవారాల్లో అసోంలో పర్యటించారు. రాహుల్ గాంధీ కన్యాకుమారిలో పర్యటిస్తున్నారు. ప్రియాంక గాంధీ బిశ్వనాథ్ జిల్లాలోని ఓ తేయాకు తోటలోకి వెళ్ళి, మిగతావారితోపాటు తేయాకు కోశారు.

రాహుల్ గాంధీ కన్యాకుమారిలోని ములగుమూడులో ఓ పాఠశాలకు వెళ్ళారు. అక్కడి విద్యార్థులతో కలిసి మెలిసి తిరిగారు. ఓ స్టూడెంట్ విసిరిన పుష్-అప్స్ సవాలును స్వీకరించి, పుష్-అప్స్ చేశారు. రాహుల్ గాంధీ జపనీస్ మార్షల్ ఆర్ట్ ఐకిడోలో శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. ఆయన ఒంటి చేత్తో చేసిన విన్యాసాలు విద్యార్థులను ఆకర్షించాయి.

కొన్నిరోజుల క్రితం రాహుల్​ కేరళలోని సముద్రంలో దూకి స్విమ్​ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారులతో కలిసి భోజనం చేశారు. ప్రియాంక కూడా అన్నివర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు.

First Published:  2 March 2021 9:52 AM GMT
Next Story