Telugu Global
National

కమల్​ సేఫ్​ గేమ్​.. రెండుచోట్ల పోటీ..!

ప్రముఖ సినీనటుడు కమల్​ హాసన్​ మక్కల్​ నీది మయ్యం పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత పార్లమెంట్​ ఎన్నికల్లో ఆయన పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ .. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని పార్టీ మరోసారి పోటీచేయబోతున్నది. ప్రొగ్రెసివ్​ భావాలతో కమల్​ హాసన్​ పార్టీని స్థాపించారు. ఆయన నిత్యం బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఇదిలా ఉంటే ఆ సారి కమల్​ హాసన్​ రెండు నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నట్టు సమాచారం. ఒకచోట ఓడిపోయినా […]

కమల్​ సేఫ్​ గేమ్​.. రెండుచోట్ల పోటీ..!
X

ప్రముఖ సినీనటుడు కమల్​ హాసన్​ మక్కల్​ నీది మయ్యం పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత పార్లమెంట్​ ఎన్నికల్లో ఆయన పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ .. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని పార్టీ మరోసారి పోటీచేయబోతున్నది. ప్రొగ్రెసివ్​ భావాలతో కమల్​ హాసన్​ పార్టీని స్థాపించారు. ఆయన నిత్యం బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తుంటారు.

ఇదిలా ఉంటే ఆ సారి కమల్​ హాసన్​ రెండు నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నట్టు సమాచారం. ఒకచోట ఓడిపోయినా మరోచోట అయినా గెలవాలని ఆయన పట్టుదలతో ఉన్నారట. ఆలందూర్‌, కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఎంఎన్‌ఎం పార్టీ 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ రాష్ట్రంలో 39 స్థానాల్లో పోటీచేసిన ఎంఎన్‌ఎం అభ్యర్థులు చాలామంది డిపాజిట్లు కోల్పోయారు.

అయితే చెన్నై సౌత్‌, చెన్నై నార్త్‌, చెన్నై సెంట్రల్‌, కోయంబత్తూర్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఓట్లు వచ్చాయి. పట్టణప్రాంతాల్లో మాత్రమే కమల్​ అంతో ఇంతో ప్రభావం చూపగలుతారని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఈ క్రమంలో ఆయన ఈ నియోజకవర్గాలను ఎంచుకున్నట్టు సమాచారం.

పార్లమెంటు ఎన్నికల్లో శ్రీపెరుంబుదూర్‌ నియోజక వర్గంలో ఉన్న అలందూర్‌ శాసనసభ నియోజకవర్గంలో ఎంఎన్‌ఎంకు 1.35 లక్షల ఓట్లు వచ్చాయి. కోయంబత్తూర్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కోయంబత్తూర్‌ దక్షిణంలో 1.45 లక్షల ఓట్లు సాధించి రెండు, మూడు స్థానాల్లో నిలిచింది. పార్లమెంట్​ ఎన్నికల ఎఫెక్ట్​తో .. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కమల్ తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. తనదైన స్టయిల్​లో ప్రసంగాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

First Published:  2 March 2021 4:03 AM GMT
Next Story