Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ కోసం మరో ఫారిన్ టెక్నీషియన్

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆఖరి నిమిషంలో మరో ఫారిన్ టెక్నీషియన్ ను రంగంలోకి దించాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పోవెల్ ను తీసుకున్నాడు. నిజానికి ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల షూటింగ్ చాన్నాళ్లుగా జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో భారీ ఎత్తున జూనియర్ ఆర్టిస్టులు, గుర్రాలతో ఈ షూట్ తీస్తున్నారు. అయితే రష్ చూసిన రాజమౌళి తృప్తి పడలేదు. […]

ఆర్ఆర్ఆర్ కోసం మరో ఫారిన్ టెక్నీషియన్
X

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆఖరి నిమిషంలో మరో ఫారిన్ టెక్నీషియన్ ను రంగంలోకి దించాడు
దర్శకుడు రాజమౌళి. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్
కొరియోగ్రాఫర్ నిక్ పోవెల్ ను తీసుకున్నాడు.

నిజానికి ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల షూటింగ్ చాన్నాళ్లుగా జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో
భారీ ఎత్తున జూనియర్ ఆర్టిస్టులు, గుర్రాలతో ఈ షూట్ తీస్తున్నారు. అయితే రష్ చూసిన రాజమౌళి తృప్తి
పడలేదు. మరింత బాగా ఈ సన్నివేశాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఈసారి పోవెల్ ను
రంగంలోకి దించుతున్నాడు.

అంటే.. దాదాపు ఇది రీషూట్ అనే అనుకోవచ్చు. త్వరలోనే నిక్ పోవెల్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ యాక్షన్
సీన్స్ రీషూట్ చేస్తారన్నమాట. తారక్, చరణ్ మరోసారి సెట్స్ పైకి రావాలన్నమాట. అక్టోబర్ 13న
ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

First Published:  2 March 2021 9:20 PM GMT
Next Story