Telugu Global
Cinema & Entertainment

ఇకపై టాలీవుడ్ లో ఖరీదైన కారు ఇదే

టాలీవుడ్ జనాల ఫేవరెట్ కారు రేంజ్ రోవర్. దాదాపు స్టార్ హీరోలందరికీ రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. మరి టాలీవుడ్ జనాల్లో అత్యంత ఖరీదైన కారు ఎవరి దగ్గర ఉంది. దీనికి మొన్నటివరు ప్రభాస్ పేరు వినిపించేది. ఎందుకంటే, అత్యంత ఖరీదైన కారు అతడి దగ్గర ఉంది. దాదాపు 3 కోట్ల రూపాయల కారు అది. అయితే ఇప్పుడా రికార్డును ఎన్టీఆర్ తిరగరాయబోతున్నాడు. టాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన కారును త్వరలోనే సొంతం చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఆ […]

ఇకపై టాలీవుడ్ లో ఖరీదైన కారు ఇదే
X

టాలీవుడ్ జనాల ఫేవరెట్ కారు రేంజ్ రోవర్. దాదాపు స్టార్ హీరోలందరికీ రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి.
మరి టాలీవుడ్ జనాల్లో అత్యంత ఖరీదైన కారు ఎవరి దగ్గర ఉంది. దీనికి మొన్నటివరు ప్రభాస్ పేరు
వినిపించేది. ఎందుకంటే, అత్యంత ఖరీదైన కారు అతడి దగ్గర ఉంది. దాదాపు 3 కోట్ల రూపాయల కారు
అది. అయితే ఇప్పుడా రికార్డును ఎన్టీఆర్ తిరగరాయబోతున్నాడు.

టాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన కారును త్వరలోనే సొంతం చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఆ కారు ఖరీదు
అక్షరాలా 5 కోట్ల రూపాయలు. లాంబోర్గిని కంపెనీకి చెందిన ఉరుస్ మోడల్ కారు అది. ప్రత్యేకంగా ఇటలీ
నుంచి దాన్ని దిగుమతి చేసుకుంటున్నాడు ఎన్టీఆర్.

విలాసవంతమైన లగ్జరీ స్పోర్ట్స్ కారు ఇది. త్వరలోనే హైదరాబాద్ రోడ్లపై ఈ కారు పరుగులు పెట్టబోతోంది.
ఈ కారు కొనుక్కోవాలని ఎప్పట్నుంటో ఆశపడుతున్నాడు ఎన్టీఆర్. రీసెంట్ గా జెమినీ ఛానెల్ కోసం ఓ
కార్యక్రమం చేయడానికి ఒప్పుకున్నాడు. దానికి సంబంధించి యాడ్ షూట్ కూడా పూర్తిచేశాడు. ఆ
డబ్బుతోనే ఈ కారు కొన్నాడట.

First Published:  2 March 2021 9:27 PM GMT
Next Story