Telugu Global
National

గూగుల్ ఉమెన్స్ డే డూడుల్ చూశారా?

స్పెషల్ డేలు, ప్రముఖుల పుట్టినరోజు లాంటి సందర్భాల్లో సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేకమైన డూడుల్ ను పెట్టి తమ అభినందనల్ని తెలియజేస్తుంది. అలాగే మార్చి 8వ తేదీన, అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021 సందర్భంగా ఒక డూడుల్ ను క్రియేట్ చేసింది. అదెలా ఉందంటే.. ఉమెన్స్ డే సందర్భంగా గూగుల్ రూపొందించిన వీడియో మహిళా సాధికారతను ప్రతిబింబించే విధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలంతా ఏయే రంగాల్లో రాణిస్తున్నారో సింపుల్ గా తెలిపే ప్రయత్నం చేసింది. విద్యా, […]

గూగుల్ ఉమెన్స్ డే డూడుల్ చూశారా?
X

స్పెషల్ డేలు, ప్రముఖుల పుట్టినరోజు లాంటి సందర్భాల్లో సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేకమైన డూడుల్ ను పెట్టి తమ అభినందనల్ని తెలియజేస్తుంది. అలాగే మార్చి 8వ తేదీన, అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021 సందర్భంగా ఒక డూడుల్ ను క్రియేట్ చేసింది. అదెలా ఉందంటే.. ఉమెన్స్ డే సందర్భంగా గూగుల్ రూపొందించిన వీడియో మహిళా సాధికారతను ప్రతిబింబించే విధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలంతా ఏయే రంగాల్లో రాణిస్తున్నారో సింపుల్ గా తెలిపే ప్రయత్నం చేసింది.

విద్యా, వైద్యం, సంగీతం, సినిమా, సైన్స్, క్రీడా, ట్రెక్కింగ్, శాస్త్రవేత్తలు, రచయితలు, న్యాయవాదులు ఇలా అన్ని రంగాలలో మహిళల చేయి ఉందన్న సంకేతంగా కేవలం మహిళ చేయినే హైలెట్ చేసి చివరిలో ఆ చేతులన్ని కలిసి పిడికిలి బిగించిన ఫ్రేమ్ తో వీడియో ఎండ్ అవుతుంది.

ఈ 41 సెకన్ల నిడివి ఉన్న వీడియో డూడుల్ చాలా డిఫరెంట్ గా మెసేజ్ కన్వే అయ్యేలా డిజైన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ , వారు కోరుకునే శాశ్వత వారసత్వాన్ని గుర్తు చేస్తూ.. వారికి ఎదురయ్యే సమస్యలను అధిగమించి రకరకాల రంగాల్లో విజయాలు సాధించడాన్ని ఈ డూడుల్ లో గుర్తు చేశారు. ఈ వీడియోను డిజైన్ చేసిన ఇలస్ట్రేటర్-హెలెన్ లెరోక్స్, గ్లోబల్ గూగుల్ హోమ్ పేజీలను అలంకరించే చిత్రాలను రూపొందించడానికి తన సొంత అమ్మమ్మ నుండి అనేక విషయాలను సేకరిస్తుంటానని చెప్తుంటాడు.

First Published:  8 March 2021 3:41 AM GMT
Next Story