Telugu Global
National

బీజేపీని ఇరుకున పెడుతున్న అన్నాడీఎంకే..

డీఎంకే మేనిఫెస్టోకి పోటీగా, అన్నాడీఎంకే నేతలు కూడా ఎన్నికల హామీల్లో ఉచితాలను వల్లెవేశారు. అయితే ఆ ఉచిత హామీలు ఇప్పుడు బీజేపీ మెడకు చుట్టుకోబోతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు, గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరగడానికి కేంద్ర ప్రభుత్వ విధాననాలే కారణం అనేది స్పష్టంగా తెలుస్తున్న విషయం. ఈ దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే సిలిండర్ పై రూ.100 రాయితీ ఇస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ హామీ ఇచ్చారు. అంతకు మించి అన్నట్టు […]

బీజేపీని ఇరుకున పెడుతున్న అన్నాడీఎంకే..
X

డీఎంకే మేనిఫెస్టోకి పోటీగా, అన్నాడీఎంకే నేతలు కూడా ఎన్నికల హామీల్లో ఉచితాలను వల్లెవేశారు. అయితే ఆ ఉచిత హామీలు ఇప్పుడు బీజేపీ మెడకు చుట్టుకోబోతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు, గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరగడానికి కేంద్ర ప్రభుత్వ విధాననాలే కారణం అనేది స్పష్టంగా తెలుస్తున్న విషయం. ఈ దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే సిలిండర్ పై రూ.100 రాయితీ ఇస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ హామీ ఇచ్చారు. అంతకు మించి అన్నట్టు అన్నాడీఎంకే నేతలు ఏడాదికి ఆరు సిలిండర్లు పూర్తి ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు, ఇంటింటికీ వాషింగ్ మెషిన్, ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు, ఇంటి వద్దకే రేషన్, పక్కా ఇళ్లు, ఉచిత డేటా, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం.. ఇలా భారీగా హామీలిచ్చారు. లెక్కతీస్తే మొత్తం అన్నాడీఎంకే హామీల సంఖ్య 163.

అయితే వీటిలో గ్యాస్ సిలిండర్ల ఉచిత పంపిణీ, పెట్రోలు, డీజిల్ రేట్లపై రాయితీ వంటివి బీజేపీని ఇరుకున పెట్టేవిగా ఉన్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో కాకపోయినా, తమిళనాట బేజీపీ, అన్నాడీఎంకే కలసి పోటీకి దిగుతున్నాయి కాబట్టి.. వారిచ్చిన హామీలను వీరు కూడా ఇచ్చినట్టే చెప్పాలి. అంటే కేవలం తమిళనాడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రం వరకే బీజేపీ ఉచిత గ్యాస్ సిలిండర్లరు ఓకే చెప్పినట్టు అనుకోవాలి. మరి మిగతా రాష్ట్రాల సంగతేంటి? అక్కడ కూడా బీజేపీ ఉచిత సిలిండర్లకు సై అంటుందా, పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గిస్తుందా? ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి మాత్రమే ఈ హామీలు పరిమితం అయితే మిగతా రాష్ట్రా సంగతేంటి? అంటే బీజేపీ వారిని మోసం చేసినట్టే కదా?

ఇప్పటికే పెట్రో ఉత్పత్తులు, గ్యాస్ రేట్ల పెంపుతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత మూటగట్టుకుంటోంది బీజేపీ. ఈ దశలో కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉచిత హామీలు ఇచ్చి బీజేపీని ఇరుకున పెట్టింది అన్నాడీఎంకే. అంతే కాదు.. అన్నాడీఎంకే ఇచ్చిన మరికొన్ని హామీలు కూడా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ దశలో అన్నాడీఎంకే మేనిఫెస్టోని బీజేపీ సమర్థిస్తుందా, లేక తమ వరకు తాము మరో మేనిఫెస్టో విడుదల చేస్తుందా..? అసలీ కూటమి అధికారంలోకి వస్తే ఎవరి హామీలు అమలు చేస్తారు అనేది తేలాల్సి ఉంది.

First Published:  15 March 2021 4:25 AM GMT
Next Story