Telugu Global
National

అమ్మకానికి ఎయిర్ పోర్టులు

పెట్టుబడుల ఉపసంహరణ, అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎయిర్ పోర్ట్ లలో వాటాలను కూడా అమ్మేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటీకరణ కోసం గుర్తించిన 13 ఎయిర్ పోర్ట్ అధారిటీ కింద ఉన్న విమానాశ్రయాల్లో కొన్నింటిని అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో విక్రయించబోయే విమానాశ్రయాల జాబితాలో అమృత్‌సర్‌, వారణాసి, భువనేశ్వర్‌, […]

అమ్మకానికి ఎయిర్ పోర్టులు
X

పెట్టుబడుల ఉపసంహరణ, అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎయిర్ పోర్ట్ లలో వాటాలను కూడా అమ్మేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రైవేటీకరణ కోసం గుర్తించిన 13 ఎయిర్ పోర్ట్ అధారిటీ కింద ఉన్న విమానాశ్రయాల్లో కొన్నింటిని అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో విక్రయించబోయే విమానాశ్రయాల జాబితాలో అమృత్‌సర్‌, వారణాసి, భువనేశ్వర్‌, ఇండోర్‌, రాయ్‌పూర్‌, తిరుచ్చి తదితర విమానాశ్రయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. వాటి తర్వాత దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ల్లో మిగిలిన వాటాను 2021––22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జిఎంఆర్ గ్రూప్ 54 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 26 శాతం కలిగి ఉన్నాయి. హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఉమ్మడి తెలుగు ప్రభుత్వాలుకలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌కు 26 శాతం వాటా ఉంది. బెంగళూరు విమానాశ్రయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి ఏఏఐకి 26 శాతం వాటా ఉంది. అయితే ఇప్పుడు ఈ వాటాలన్నింటినీ ప్రైవేటుకి అమ్మేయబోతున్నారు. వీటి ద్వారా రూ .2.5 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని కేంద్రం భావిస్తోంది.

First Published:  15 March 2021 4:16 AM GMT
Next Story