Telugu Global
National

పది శాతం వ్యాక్సిన్ వృథా.. తెలుగు రాష్ట్రాలకు తిట్లు..

తెలుగు రాష్ట్రాలకు తిట్లు పడ్డాయి. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వ్యాక్సిన్ వేస్ట్ చేయొద్దని క్లాస్ పీకారు. ఎందుకంటే.. వ్యాక్సిన్‌ను వృథా చేయడంలో తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయట. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 10 శాతం కన్నా ఎక్కువగా వ్యాక్సిన్‌ వృథా అవుతుందని మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండడంతో పాటు ‘వ్యాక్సిన్ మైత్రి’ పేరుతో 72 ఇతర దేశాలకు కూడా భారత్ వ్యాక్సిన్ సరఫరా చేస్తుంది. ప్రపంచమంతా భారత్ పంపించే […]

పది శాతం వ్యాక్సిన్ వృథా.. తెలుగు రాష్ట్రాలకు తిట్లు..
X

తెలుగు రాష్ట్రాలకు తిట్లు పడ్డాయి. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వ్యాక్సిన్ వేస్ట్ చేయొద్దని క్లాస్ పీకారు. ఎందుకంటే.. వ్యాక్సిన్‌ను వృథా చేయడంలో తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయట. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 10 శాతం కన్నా ఎక్కువగా వ్యాక్సిన్‌ వృథా అవుతుందని మోదీ అన్నారు.

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండడంతో పాటు ‘వ్యాక్సిన్ మైత్రి’ పేరుతో 72 ఇతర దేశాలకు కూడా భారత్ వ్యాక్సిన్ సరఫరా చేస్తుంది. ప్రపంచమంతా భారత్ పంపించే వ్యాక్సిన్‌ను సంజీవనిగా భావిస్తోంటే.. తెలుగు రాష్ట్రాలు వాటిని వృథా చేయడం బాధించే విషయమని పలువులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా అవుతోందంటూ ప్రస్తావించిన మోడీ, వ్యాక్సినేషన్‌ను స్పీడ‌ప్‌‌ చేయాలని ఇరువురు సీఎంలకు సూచించారు. కరోనాపై పోరుతో వచ్చిన ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసంగా మారకుండా చూసుకోవాలని చురకలేశారు. వ్యాక్సిన్‌ వృథా ఎక్కువగా జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉందని సీఎంలకు క్లాస్ పీకారు.

అయితే వాక్సినేషన్ జరుగుతున్న వేళ ఎన్నికలు వద్దని సూచించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. చివరికి ఎన్నికలు పెట్టాల్సి రావడంతో సిబ్బందినంతా ఎన్నికల కోసం కేటాయించాల్సి వచ్చింది. దీంతో అటు వ్యాక్సినేషన్, ఇటు ఎన్నికల ప్రక్రియల్లో సతమతమైన సిబ్బంది.. ఎంత కష్టపడినా వ్యాక్సిన్ వృధాను ఆపలేకపోయింది.

తెలంగాణలో 17.6 శాతం వ్యాక్సిన్‌ వృథా జరిగితే, ఏపీలో 11.6 శాతం డోసేజ్ వేస్ట్‌ అయ్యింది. వీటితో పాటు యూపీ, కర్నాటక, జమ్ముకశ్మీర్‌లోనూ టీకా వృథా అవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వాలతో కాన్ఫరెన్స్ జరిపిన ప్రధాని సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాక్సిన్ ను వృథా కాకుండా చూడలని సూచించారు.

First Published:  18 March 2021 4:06 AM GMT
Next Story