Telugu Global
NEWS

విశాఖ ఉక్కు.. గంటా.. కేటీఆర్

ఇప్పుడు ఏపీలో అతి పెద్ద చర్చ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఎంతో మంది ప్రాణ త్యాగాలతో విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ ఏర్పడింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ నవరత్న పరిశ్రమ ఇప్పుడు ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తున్నది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్స్)లో వాటాలను అమ్మేయాలని నిర్ణయించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపేయాలంటూ ఎంతో […]

విశాఖ ఉక్కు.. గంటా.. కేటీఆర్
X

ఇప్పుడు ఏపీలో అతి పెద్ద చర్చ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఎంతో మంది ప్రాణ త్యాగాలతో విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ ఏర్పడింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ నవరత్న పరిశ్రమ ఇప్పుడు ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తున్నది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్స్)లో వాటాలను అమ్మేయాలని నిర్ణయించింది.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపేయాలంటూ ఎంతో మంది ఉద్యోగులు నిత్యం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా మద్దతు పలికారు. నిత్యం సోషల్ మీడియాలో కూడా కేంద్రానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో టీడీపీకి రాష్ట్రంలో అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందిన గంటా శ్రీనివాసరావు అధికార వైసీపీలోనికి రావాలని ప్రయత్నించి భంగపడ్డారు.

సరిగ్గా అదే సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణతో ఆయన ప్రజల్లోకి వెళ్లడం మొదలు పెట్టారు. ప్రతీ నిత్యం కార్మికులతో మాట్లాడుతూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని కేంద్రానికి సూచించారు. అవసరమైతే విశాఖ వెళ్లి ఆందోళన చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు.

దీంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆందోళన కార్యక్రమాలను ఉధృతంగా మార్చడానికి గంటా వ్యూహం రచించినట్లు తెలుస్తున్నది. ఆయన శనివారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు. గతంలో ఉద్యమాలు, పోరాటాలు చేసిన అనుభవంతో ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని కోరారు.

గంటా ఆహ్వానాన్ని మన్నించిన కేటీఆర్.. త్వరలో తన నిర్ణయాన్ని చెబుతానన్నారు. ఇలా విశాఖ ఉక్కు ఉద్యమానికి గంటా రాజకీయ సమీకరణ చేస్తూ ముందుకు దూసుకొని పోతున్నారు. పార్టీ పరంగా పెద్దగా మద్దతు లేకపోయినా.. తన రాజకీయ భవిష్యత్ కోసం ఉద్యమాన్ని భుజాలపై వేసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

First Published:  20 March 2021 5:34 AM GMT
Next Story