Telugu Global
NEWS

‌సుదీర్ఘ ఉత్కంఠకు తెర.. సురభి వాణి గెలుపు..!

‌సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నాలుగు రోజులుగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫలితం వచ్చేసింది. పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్​ పట్టభద్రుల స్థానంలో సురభి వాణిదేవి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. నల్లగొండ, వరంగల్​, కరీంనగర్​, ఖమ్మం పట్టభద్రుల స్థానం ఫలితం ఇంకా తేలలేదు. అయితే హైదరాబాద్​ ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం టీఆర్​ఎస్​ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపొందారు. ఆమెకు 1,49,269 ఓట్లు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థి రాంచంద్రరావుకు 1,37,566 ఓట్లు వచ్చాయి. 11,703 ఓట్ల మెజార్టీతో వాణిదేవి గెలుపొందారు. […]

‌సుదీర్ఘ ఉత్కంఠకు తెర.. సురభి వాణి గెలుపు..!
X

‌సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నాలుగు రోజులుగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫలితం వచ్చేసింది. పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్​ పట్టభద్రుల స్థానంలో సురభి వాణిదేవి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. నల్లగొండ, వరంగల్​, కరీంనగర్​, ఖమ్మం పట్టభద్రుల స్థానం ఫలితం ఇంకా తేలలేదు. అయితే హైదరాబాద్​ ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం టీఆర్​ఎస్​ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపొందారు. ఆమెకు 1,49,269 ఓట్లు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థి రాంచంద్రరావుకు 1,37,566 ఓట్లు వచ్చాయి. 11,703 ఓట్ల మెజార్టీతో వాణిదేవి గెలుపొందారు.

నాలుగు రోజుల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కూడా మొత్తం ఓట్లలో సగం కంటే ఎక్కువగా రాకపోవడంతో .. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్య ఓట్లలో సురభి వాణిదేవి విజయం సాధించారు. ప్రస్తుతం నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో ఇంకా కౌంటింగ్​ కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ పల్లా రాజేశ్వర్​రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కోదండరాం ఎలిమినేషన్​ అయ్యారు. కోదండరాంకు వేసిన రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తున్నారు. అయితే ఈ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్​ మల్లన్న రెండో స్థానంలో కొనసాగుతున్నారు. కోదండరాంకు వేసిన ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే కాబట్టి .. ఆయనకు వేసే రెండో ప్రాధాన్య ఓట్లు తనకే పడబోతున్నాయని తీన్మార్​ మల్లన్న అలియాస్​ నవీన్​ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే పల్లా రాజేశ్వర్​రెడ్డి గెలుపునకు కొన్ని ఓట్లు మాత్రమే కావల్సి ఉంది. దీంతో ఆయన కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరోవైపు సురభి వాణిదేవి గెలుపుతో టీఆర్​ఎస్​ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్​ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎంతో వ్యూహాత్మకంగా పీవీ కుమార్తెను రంగంలోకి దించారు. మంత్రులకు ఎక్కడికక్కడ బాధ్యతలు అప్పగించి పర్యవేక్షించారు.

తొలి రౌండ్​ నుంచి ఆధిక్యం కనబర్చిన సురభి వాణిదేవి చివరి వరకు ఆధిపత్యాన్ని కొనసాగించారు. రెండో ప్రాధాన్య ఓట్లలోనూ అధిక ఓట్లు సాధించి గెలుపొందారు.

First Published:  20 March 2021 8:47 AM GMT
Next Story