Telugu Global
Cinema & Entertainment

లక్ష్య మూవీ అప్ డేట్స్

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టులు జ‌గ‌ప‌తి బాబు, సచిన్ ఖేడేకర్ న‌టిస్తున్నారు. నాగ‌శౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీలో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని ఎయిట్‌ప్యాక్ లుక్‌తో స‌ర్పైజ్ చేశారు నాగ‌శౌర్య‌. ఇప్ప‌టికే 80% షూటింగ్ […]

లక్ష్య మూవీ అప్ డేట్స్
X

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’.
నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టులు
జ‌గ‌ప‌తి బాబు, సచిన్ ఖేడేకర్ న‌టిస్తున్నారు.

నాగ‌శౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్
హంగుల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీలో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని ఎయిట్‌ప్యాక్ లుక్‌తో
స‌ర్పైజ్ చేశారు నాగ‌శౌర్య‌. ఇప్ప‌టికే 80% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్
కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది.

ప్రాచీన కాలంలో ఆర్చరీని వేట మరియు పోరాటాల‌ కోసం ఉపయోగించేవారు. అనేక పౌరాణిక కథలలో
దాని ఉనికిని మరచిపోలేము. గొప్ప యోధులుగా, దేవుడిగా వ్యవహరించే వ్యక్తులు ఎల్లప్పుడూ విల్లుని
ధ‌రించే కనిపిస్తారు. ఇప్పుడు ఆ క్రీడ‌ వెండితెరపైకి రాబోతుంది. విలువిద్య ఆధారంగా భారతదేశం యొక్క
మొట్టమొదటి చిత్రం త్వరలో థియేటర్లలోకి రావ‌డానికి సిద్ధ‌మైంది. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం
అందిస్తున్నాడు.

First Published:  25 March 2021 10:06 AM GMT
Next Story