Telugu Global
NEWS

సాగర్​లో బీజేపీకి బిగ్​షాక్​..!

నాగార్జున సాగర్​ ఉప ఎన్నికలో భారతీయ జనతాపార్టీకి గట్టి షాక్​ తగిలింది. ఆ పార్టీ నుంచి టికెట్​ ఆశించి భంగపడ్డ కంకణాల నివేదిత రెడ్డి, కడారి అంజయ్య యాదవ్​ బీజేపీకి గుడ్​బై చెప్పనున్నారు. వాళ్లు త్వరలోనే సీఎం కేసీఆర్​ సమక్షంలో టీఆర్​ఎస్​లో చేరబోతున్నట్టు సమాచారం. టికెట్​ రాకపోవడంతో ఈ ఇద్దరు నేతలు తీవ్ర అసంతృప్తి చెందారు. సాగర్​ ఉప ఎన్నికకు నోటిఫికేషన్​ రాకముందు నుంచే వీళ్లు ప్రచారం చేసుకున్నారు. నివేదిత రెడ్డి ఓ ప్రచార రథాన్ని కూడా […]

సాగర్​లో బీజేపీకి బిగ్​షాక్​..!
X

నాగార్జున సాగర్​ ఉప ఎన్నికలో భారతీయ జనతాపార్టీకి గట్టి షాక్​ తగిలింది. ఆ పార్టీ నుంచి టికెట్​ ఆశించి భంగపడ్డ కంకణాల నివేదిత రెడ్డి, కడారి అంజయ్య యాదవ్​ బీజేపీకి గుడ్​బై చెప్పనున్నారు. వాళ్లు త్వరలోనే సీఎం కేసీఆర్​ సమక్షంలో టీఆర్​ఎస్​లో చేరబోతున్నట్టు సమాచారం. టికెట్​ రాకపోవడంతో ఈ ఇద్దరు నేతలు తీవ్ర అసంతృప్తి చెందారు. సాగర్​ ఉప ఎన్నికకు నోటిఫికేషన్​ రాకముందు నుంచే వీళ్లు ప్రచారం చేసుకున్నారు. నివేదిత రెడ్డి ఓ ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేయించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించారు.

అయితే బీజేపీ అనూహ్యంగా రవికుమార్​ నాయక్​ అనే వ్యక్తికి టికెట్​ ఇచ్చింది. దీంతో నివేదిత, అంజయ్య యాదవ్​ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నివేదిత రెడ్డి చాలా కాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. ఆమె భర్త శ్రీధర్​రెడ్డి .. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు.

గత ఎన్నికల్లో నివేదిత బీజేపీ తరఫున పోటీచేశారు. త్వరలో ఆమె సీఎం కేసీఆర్​ సమక్షంలో టీఆర్​ఎస్​లో చేరబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ పరిణామంతో రాష్ట్ర బీజేపీ ఒక్కసారిగా షాక్​కు గురైంది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలను బుజ్జగించే పనిలో పడింది బీజేపీ హై కమాండ్​. సాగర్​ నియోజకవర్గంలో యాదవ ఓట్లు అధిక శాతం ఉన్నాయి. ఇక్కడ బీజేపీ.. నుంచి కడారి అంజయ్య యాదవ్​ టికెట్​ను ఆశించారు. కానీ ఆయనకు కూడా టికెట్​ దక్కలేదు.

ఇక్కడ ఈసారి విభిన్న తరహాలో ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు .. మూడు విభిన్న సామాజికవర్గాలకు టికెట్లు ఇచ్చారు. టీఆర్​ఎస్​ యాదవ సామాజిక వర్గానికి టికెట్​ ఇవ్వగా.. కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డికి టికెట్​ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ మాత్రం అనూహ్యంగా జనరల్​ సీటులో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన రవికుమార్​ యాదవ్​ను రంగంలోకి దించింది. అయితే సాగర్​లో సామాజిక సమీకరణాలు పనిచేస్తాయో లేదో వేచి చూడాలి.

First Published:  30 March 2021 12:00 PM GMT
Next Story