Telugu Global
National

స్త్రీ-పురుష అంతరంలో భారత్‌కు 140వ స్థానం

స్త్రీ-పురుష సమానత్వానికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రూపొందించిన నివేదికలో భారత్‌కు 140వ ర్యాంకు లభించింది. 156 దేశాల్లో మహిళలకు సంబంధించి ఉపాధి అవకాశాలు, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ ప్రాధాన్యత వంటి విషయాల్లో మహిళల స్థానంపై అధ్యయనం నిర్వహించారు. స్త్రీ-పురుష సమానత్వంలో భారత్‌ చాలా వెనకబడి ఉంద‌ని ఈ నివేదికలో తేలింది. గతేడాది కంటే 28 స్థానాలు దిగువకు పడిపోవడం గమనార్హం. దక్షిణాసియాలో ఇండియా కంటే తక్కువ ర్యాంకులో పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్ మాత్రమే ఉండటం గమనార్హం. గత […]

స్త్రీ-పురుష అంతరంలో భారత్‌కు 140వ స్థానం
X

స్త్రీ-పురుష సమానత్వానికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రూపొందించిన నివేదికలో భారత్‌కు 140వ ర్యాంకు లభించింది. 156 దేశాల్లో మహిళలకు సంబంధించి ఉపాధి అవకాశాలు, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ ప్రాధాన్యత వంటి విషయాల్లో మహిళల స్థానంపై అధ్యయనం నిర్వహించారు. స్త్రీ-పురుష సమానత్వంలో భారత్‌ చాలా వెనకబడి ఉంద‌ని ఈ నివేదికలో తేలింది. గతేడాది కంటే 28 స్థానాలు దిగువకు పడిపోవడం గమనార్హం. దక్షిణాసియాలో ఇండియా కంటే తక్కువ ర్యాంకులో పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్ మాత్రమే ఉండటం గమనార్హం.

గత ఏడాది 153 దేశాల్లో ఇలాంటి సర్వే నిర్వహించగా భారత్ 112వ స్థానంలో నిలిచింది.. కానీ ఏడాదిలోగానే స్త్రీ-పురుష అవకాశాల అంతరం 3 శాతం ఎక్కువైనట్లు వెల్లడైంది. లింగబేధాన్ని రూపుమాపడంతో మన దేశంలో పురోగతి చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు బాలికల విద్యకు సంబంధించిన విషయంలో మాత్రం భారత్‌లో స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది. అయితే నిరక్షరాస్యత పురుషుల్లో 17.6 శాతంగా ఉండగా మహిళల్లో 34.2 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.

ఇక స్త్రీ-పురుష సమానత్వంలో ఐస్‌లాండ్ వరుసగా 12వ సారి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, రువాండ, స్వీడన్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ దేశాలు ఉన్నాయి. దక్షిణాసియాలో మనకంటే ముందు బంగ్లాదేశ్ 65, నేపాల్ 106, శ్రీలంక 116, భూటాన్ 130వ స్థానాల్లో ఉన్నాయి.

First Published:  1 April 2021 2:25 AM GMT
Next Story