Telugu Global
NEWS

ఎవరు లోకల్..? ఎవరు నాన్ లోకల్..??

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో స్థానిక, స్థానికేతర వివాదాలు హైలెట్ అవుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికేతరుడంటూ టీఆర్ఎస్ చేసిన విమర్శలను స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ నేతల స్థానికతను ఆయన ప్రశ్నించారు. సిరిసిల్లకు కేటీఆర్ కి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. గజ్వేల్ లో కేసీఆర్ స్థానికుడా అని అడిగారు. సిద్ధిపేటలో హరీష్ స్థానికుడు ఎందుకు అవుతారని అన్నారు. వారందరినీ ప్రజలు ఆశీర్వదించారని.. హుజూరాబాద్ లో కూడా వెంకట్ […]

ఎవరు లోకల్..? ఎవరు నాన్ లోకల్..??
X

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో స్థానిక, స్థానికేతర వివాదాలు హైలెట్ అవుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికేతరుడంటూ టీఆర్ఎస్ చేసిన విమర్శలను స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ నేతల స్థానికతను ఆయన ప్రశ్నించారు. సిరిసిల్లకు కేటీఆర్ కి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. గజ్వేల్ లో కేసీఆర్ స్థానికుడా అని అడిగారు. సిద్ధిపేటలో హరీష్ స్థానికుడు ఎందుకు అవుతారని అన్నారు. వారందరినీ ప్రజలు ఆశీర్వదించారని.. హుజూరాబాద్ లో కూడా వెంకట్ ను గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి.

పాత సీసా.. కొత్త సారా..
బీజేపీ అనే కొత్త సీసాలో టీఆర్ఎస్ అనే పాత సారా పోసి, ఈటల రాజేందర్ మార్కెటింగ్ చేసుకుంటున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. ఇక గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ అనే పాత సారాని అదే పాత సీసాలో పోసుకుని వస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం చేయడానికి గల కారణాన్ని ఆయన మరోసారి వివరించారు. ఇంట్లో పెళ్లికి ఎదిగిన బిడ్డని మేనరికం ఇద్దామనుకుంటే.. తాగుపోతు, తిరుగుబోతు అయిన మేనమామ పారిపోయాడని పరోక్షంగా కౌశిక్ రెడ్డిని విమర్శించారు. ఆ సమయంలో బల్మూరి వెంకట్ ని పార్టీ బరిలో దింపిందని, విద్యార్థుల, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాడని, చావైనా బతురకైనే వెంకట్ కాంగ్రెస్ లోనే ఉంటారని, ఇంటికొక ఓటు ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. స్థానికేతరుడైన వెంకట్ అనామకుడైతే.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ కూడా వారి నియోజకవర్గాల్లో అనామకులేనని అన్నారు రేవంత్ రెడ్డి.

గిల్లుతాడు.. కోర్టుమెట్లెక్కుతాడు..
తనపై మంత్రి కేటీఆర్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ చిన్నపిల్లల్లాగా టీచర్ కి కంప్లయింట్ చేసినట్టు కోర్టు మెట్లెక్కుతారని, తనపై ఆయన విమర్శలు చేస్తారని, తాను విమర్శిస్తే మాత్రం కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటారని అన్నారు. కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ కి బలమైన పునాది వేస్తే.. ఆయన పెట్టిన పుట్టలోకి పాములా కేటీఆర్ వచ్చి చేరారని అన్నారు. మహేందర్ రెడ్డి సీటు గుంజుకున్నారని, అప్పటినుంచి కేటీఆర్ అక్కడ్నుంచి వెళ్లడంలేదని చెప్పారు.

హుజూరాబాద్, దుబ్బాక, నాగార్జున సాగర్.. ఇలా తెలంగాణ ఇప్పటి వరకూ మూడు ఉప ఎన్నికలు జరిగాయని, గెలిచిన టీఆర్ఎస్, ఒకచోట గెలిచిన బీజేపీ.. ఎన్నికల హామీలను ఎంతవరకు నెరవేర్చాయో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ లో వరదలొస్తే గుండు, అరగుండు కలసి అక్కడ హంగామా చేశాయని.. దాంతో ప్రజలు నమ్మి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేశారని, ఆ నమ్మకాన్ని కూడా ఇప్పుడు వారు నిలబెట్టుకోలేకపోయారని అన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. హైదరాబాద్ వరద కష్టాలను తీర్చి ఉంటే.. ఇప్పుడు ఓట్లు అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. కేసులనుంచి తప్పించుకోడానికి, ఆస్తులు కాపాడుకోడానికి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని చెప్పారు. బీజేపీ నేతలు ఈటల తరపున ప్రచారానికి ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. ఆ పార్టీలో ఈటలకున్న ప్రాధాన్యం ఏంటో అర్థమవుతోందని చెప్పారు.

First Published:  24 Oct 2021 5:46 AM GMT
Next Story