Telugu Global
International

శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి.. పగ్గాలు చేపట్టేదెవరు..?

శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. స్థానికంగా అంతా అస్తవ్యస్థమైపోయింది. ప్రపంచ దేశాలు నిత్యావసరాల రూపంలో సాయం అందిస్తున్నా పరిస్థితి అదుపులో లేదు. పోనీ అయిందేదో అయిపోయింది ఇప్పుడేం చేయాలి. ప్రభుత్వం మారితే పరిస్థితి మారుతుందా..? ఎన్నికలు జరపాలా..? అధికారం ఎవరి చేతిలో ఉండాలి, ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇదీ ఇప్పుడు అక్కడ ఉన్న అనిశ్చితి. ప్రతిపక్ష నాయకుడిని అధికారం తీసుకోవాలని అధ్యక్షుడు కోరినా ససేమిరా అనడం విశేషం. శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం […]

శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి.. పగ్గాలు చేపట్టేదెవరు..?
X

శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. స్థానికంగా అంతా అస్తవ్యస్థమైపోయింది. ప్రపంచ దేశాలు నిత్యావసరాల రూపంలో సాయం అందిస్తున్నా పరిస్థితి అదుపులో లేదు. పోనీ అయిందేదో అయిపోయింది ఇప్పుడేం చేయాలి. ప్రభుత్వం మారితే పరిస్థితి మారుతుందా..? ఎన్నికలు జరపాలా..? అధికారం ఎవరి చేతిలో ఉండాలి, ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇదీ ఇప్పుడు అక్కడ ఉన్న అనిశ్చితి. ప్రతిపక్ష నాయకుడిని అధికారం తీసుకోవాలని అధ్యక్షుడు కోరినా ససేమిరా అనడం విశేషం.

శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత ప్రేమదాసకు సూచించారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. సమగి జన బలవేగె పార్టీకి ప్రేమదాస నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ ని ఎస్.జె.బి. పార్టీ తిరస్కరించింది. తమ నేత ప్రేమదాస అధికార పగ్గాలు స్వీకరించబోవట్లేదని ప్రకటించింది. అయితే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు ఉంటుందని ఆ పార్టీ తెలిపింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని ప్రేమదాసను కోరారు, కానీ ఆయన తిరస్కరించారు.

ఎవరెన్ని చెప్పినా ప్రేమదాస మాత్రం తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు ససేమిరా అంటున్నారు. శ్రీలంక అధ్యక్ష స్థానం నుంచి గొటబాయ రాజపక్స, ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స వైదొలిగితేనేే తమ పార్టీ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ రాజకీయ అనిశ్చితికి ముగింపు పలికేందుకు బార్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ శ్రీలంక కూడా కొన్ని ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రేమదాస సిద్ధంగా లేకపోతే.. శ్రీలంక బార్ అసోసియేషన్ తో కలసి ఈ సంక్షోభానికి తెరదించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. మొత్తమ్మీద ఈ సంక్షోభంలో శ్రీలంక పగ్గాలు చేపట్టడానికి కూడా అందరూ వెనకాడుతుండటం విశేషం.

First Published:  9 May 2022 1:07 AM GMT
Next Story