Telugu Global
NEWS

నైజీరియాలో చర్చ్ పై ఉగ్రవాదుల మారణహోమం… 50 మంది మృతి

  నైజీరియాలో ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు. ఓ చర్చిపై దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 50 మందికి పైగా మరణించగా అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిలో ఈ దారుణం జరిగింది ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున పెంతెకోస్ట్ ఆరాధకులు చర్చికి వచ్చారు. ఆ సమయంలో చర్చిలోకి తుపాకులతో ప్రవేశించిన ముష్కరులు జనంపైకి కాల్పులు జరిపారు. దాంతో 50 మంది అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. […]

నైజీరియాలో చర్చ్ పై ఉగ్రవాదుల మారణహోమం… 50 మంది మృతి
X

నైజీరియాలో ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు. ఓ చర్చిపై దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 50 మందికి పైగా మరణించగా అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిలో ఈ దారుణం జరిగింది ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున పెంతెకోస్ట్ ఆరాధకులు చర్చికి వచ్చారు. ఆ సమయంలో చర్చిలోకి తుపాకులతో ప్రవేశించిన ముష్కరులు జనంపైకి కాల్పులు జరిపారు. దాంతో 50 మంది అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. చర్చి ప్రాంగణమంతా రక్తం వరదలై పారింది. మరణించిన వారిలో అనేక మంది చిన్నారులున్నట్టు శాసనసభ్యుడు ఒగున్మోలసుయి ఒలువోలే తెలిపారు. చర్చ్ ప్రధాన ఫాస్టర్ కూడా అపహరణకు గురయ్యారని నైజీరియా దిగువ శాసన సభ ప్రతినిధి అడెలెగ్బే టిమిలీయిన్ చెప్పారు. ఉగ్రవాదులు ఇంకెంత మందిని కిడ్నాప్ చేశారన్న విషయం ఇంకా తెలియరాలేదు.

ఈ కాల్పుల ఘటనలో మరణాల సంఖ్యను ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ 50 మందికి పైగానే ఉంటారని ఆ మారణహోమం నుంచి బైట పడిన ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. చర్చిలో మృత దేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. తెగిపడిన అవయవాలతో చర్చి ప్రాంతం హృదయవిదారకంగా ఉంది.

పిశాచాలు మాత్రమే ఇలాంటి దారుణచర్యకు పాల్పడతాయని నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారి వ్యాఖ్యానించారు.చర్చిపై దాడి వెనుక ఎవరున్నారో ఇంకా తెలియరాలేదు.ఓండో చరిత్రలో ఇంత దారుణమైన ఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని శాసనమండలి సభ్యుడు ఓలువోలే అన్నారు. కాగా, చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. నైజీరియాలో అత్యంత శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా ఖ్యాతికెక్కిన ఓండోలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.

First Published:  5 Jun 2022 9:45 PM GMT
Next Story