Telugu Global
Andhra Pradesh

పాదయాత్రకు ఆంక్షలను ఎత్తేయాలట

ఆంక్షలతో పాదయాత్రకు అనుమతించిన సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తు అమరావతి జేఏసీ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ వేసింది. తన పిటీషన్‌లో సింగిల్ జడ్జి విధించిన ఆంక్షలను ఎత్తేయాలని కోరటమే ఆశ్చర్యంగా ఉంది.

పాదయాత్రకు ఆంక్షలను ఎత్తేయాలట
X

అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్న అమరావతి జేఏసీ విచిత్రమైన డిమాండ్ చేస్తోంది. అదేమిటంటే పాదయాత్రకు కోర్టు విధించిన ఆంక్షలను ఎత్తేయాలట. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి టు అరసవల్లికి పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. 44 రోజుల పాదయాత్ర తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. యాత్రలో పాల్గొంటున్న వారి గుర్తింపు కార్డులు చూపించమని అడిగారు.

ఎప్పుడైతే పోలీసులు గుర్తింపు కార్డులు అడిగారో వెంటనే యాత్రలో పాల్గొంటున్న వారంతా జంపైపోయారు. ఎందుకంటే యాత్రలో పాల్గొంటున్న వేలాది మందికి అమరావతితో సంబంధమే లేదని తేలిపోయింది కాబట్టి. పాదయాత్రకు అనుకూలంగా కోర్టు ఆదేశాలిచ్చిన‌ప్పుడు కొన్ని ఆంక్షలు కూడా విధించింది. వాటిల్లో గుర్తింపు కార్డులుండాలనేది కీలకమైనది. యాత్ర మొదలైనపుడు ఏమీ మాట్లాడని పోలీసులు రామచంద్రాపురం చేరుకున్న‌ప్పుడు కార్డులను తనిఖీ చేస్తే అసలు బండారం బయటపడింది.

దాంతో పరువుపోయిన జేఏసీ నేతలు పాదయాత్రకు వారం రోజులు బ్రేక్ ప్రకటించారు. ఇప్పుడు హఠాత్తుగా కోర్టులో కేసు వేశారు. ఆంక్షలతో పాదయాత్రకు అనుమతించిన సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తు జేఏసీ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ వేసింది. తన పిటిషన్‌లో సింగిల్ జడ్జి విధించిన ఆంక్షలను ఎత్తేయాలని కోరటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆంక్షలను ఎత్తేస్తే ఎవరుపడితే వాళ్ళు, ఎంతమందైనా పాదయాత్రలో పాల్గొనచ్చు. అప్పుడు అమ‌రావతికి లక్షల మంది మద్దతుందని మళ్ళీ కలరింగ్ ఇచ్చుకోవచ్చనే ఆలోచనే కనబడుతోంది. లేకపోతే పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలంతా కలిసిపోయారు.

యాత్రలో పాల్గొన్న వీళ్ళందరినీ అమ‌రావతి జనాలనే జేఏసీ, ఎల్లోమీడియా ఊదరగొడుతోంది. గుర్తింపు కార్డులు చూపించమన్నపుడు మొత్తం బండారం బయటపడింది. అందుకనే పాదయాత్రకు విధించిన ఆంక్షలను ఎత్తేయాలని లంచ్ మోషన్ పిటిషన్‌లో కోరింది. వీరి డిమాండ్ విన్న తర్వాత కేసును రెగ్యులర్ బెంచ్‌కి బదిలీ చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. మరీ కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందో, తీర్పు ఎప్పుడు వస్తుందో చూడాల్సిందే.

First Published:  27 Oct 2022 9:12 AM GMT
Next Story