Telugu Global
Andhra Pradesh

వాలంటీర్ల జీతాలు రెట్టింపు చేస్తా.. చంద్రబాబు మరో సెల్ఫ్ గోల్

తన హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలు వేస్ట్, జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థే బెస్ట్ అని చంద్రబాబు ఒప్పుకున్నట్టు ఆయన తాజా వ్యాఖ్యలతో తేలిపోయింది.

వాలంటీర్ల జీతాలు రెట్టింపు చేస్తా.. చంద్రబాబు మరో సెల్ఫ్ గోల్
X

ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ఎక్కడలేని ప్రేమ కురిపించారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి వస్తే వారి గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. ఈ హామీని ఎల్లో మీడియా అద్భుతమైన ప్రచారాస్త్రంగా పరిగణిస్తూ హైలైట్ చేస్తోంది. కానీ వాలంటీర్ల గురించి మాట్లాడిన ప్రతిసారీ చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారనే విషయాన్ని మరచిపోయింది. తన హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలు వేస్ట్, జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థే బెస్ట్ అని చంద్రబాబు ఒప్పుకున్నట్టు ఆయన తాజా వ్యాఖ్యలతో తేలిపోయింది.


పెన్షన్ ఇవ్వడానికి ఓ మనిషి కావాలా..? వారికి జీతం దండగ.. అసలు వాలంటీర్లు ఎందుకంటూ.. గతంలో విషం చిమ్మారు చంద్రబాబు. అప్పుడే ఆయన వాలంటీర్లకు వ్యతిరేకం అనే విషయం స్పష్టమైంది. ఇక పవన్ కల్యాణ్, వాలంటీర్లపై చేసిన దారుణ వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారని, ఉమన్ ట్రాఫికింగ్ కి కారణం వాలంటీర్లేనంటూ పవన్ ఘోరమైన అభాండాలు వేశారు. ఆ వ్యాఖ్యలపై వ్యతిరేకత రాగానే.. అందర్నీ కాదు, కొందర్నే అంటూ నాలుక మడతపెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాలంటీర్లలో ఏ ఒక్కరికీ కూటమిపై సదభిప్రాయం లేదు.

ఎన్నికల సమయంలో వాలంటీర్లను ఎలక్షన్ విధులకు దూరం పెట్టేలా చేశారు చంద్రబాబు. ఇటీవల పెన్షన్ల పంపిణీకి కూడా వారిని అనర్హులను చేశారు. దీంతో వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఈ దశలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. అధికారంలోకి వచ్చాక వాలంటీర్లందర్నీ తిరిగి విధుల్లోకి తీసుకుంటానని, ఆ ఫైల్ పైనే తొలి సంతకం పెడతానంటూ జగన్ తేల్చి చెప్పడంతో.. చంద్రబాబు తెలివిగా వారి జీతాల ప్రస్తావన తెచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్ముతారా, లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. జీతం పెంచుతానంటూ చెప్పిన చంద్రబాబు తనకి తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారని తేలిపోయింది.

వాలంటీర్లపై చంద్రబాబుకి సడన్ గా ఎందుకంత ప్రేమ..? రూ.5వేలే దండగ అన్న అదే నోటీతో జీతం రూ.10వేలు చేస్తానని చెప్పడమేంటి..? ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని అందరికీ తెలుసు. ఇంటింటికీ బెంజ్ కారు, కేజీ బంగారం అంటూ చంద్రబాబు మోసం చేడయానికి రెడీగా ఉన్నారు జాగ్రత్త అంటూ జగన్ చెప్పిన మాటలు నిజమని చంద్రబాబు తాజా స్టేట్ మెంట్ రుజువు చేస్తోంది.

First Published:  9 April 2024 10:02 AM GMT
Next Story